Hyderabad Girl Beaten Punjab Woman Took Obscene Video Of Her: స్నాప్‌చాట్‌లో ఏర్పడిన పరిచయం.. ఒక మహిళ కొంపముంచింది. ఘోర అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. నగ్న వీడియోలు తీసి, ఘోరంగా కొట్టి, ఆమె వద్దనున్న వస్తువులన్నీ లాక్కొని.. రోడ్డున పడేశారు. చివరికి ఆమె పోలీసులకు తన గోడుకు వెళ్లబోసుకోవడంతో, నిందితులు అరెస్ట్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌కు చెందిన నీరూ శర్మకు కొంతకాలం క్రితం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో నివసించే భావన అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి వీరి మధ్య చాటింగ్ మొదలైంది. ఈ క్రమంలోనే మంచి స్నేహబంధం ఏర్పడింది. హైదరాబాద్‌లో ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చని, ఇక్కడికి రమ్మని భావన పిలవడంతో.. నీతూ శర్మ గత నెల 22వ తేదీన తన కూతురితో కలిసి ఇక్కడికి వచ్చేసింది. భావన ఇంట్లోనే మకాం పెట్టింది.
అంతా సవ్యంగానే గడిచింది కానీ, ఈనెల 4వ తేదీన నీతూశర్మకి ఓ అనూహ్యమైన పరిణామం ఎదురైంది. అర్థరాత్రి 12 గంటల సమయంలో భావన స్నేహితురాలు పూనం ఆమె ఇంటికి వచ్చింది. అకారణంగా నీతూశర్మని దుర్భాషలాడటమే కాకుండా, చేతికి దొరికిన ప్రతి వస్తువుతో కొట్టింది. ఆపై నీతూ బట్టలు విప్పేసి, కూతురు సమక్షంలోనే నగ్నంగా వీడియోలు చిత్రీకరించింది. వారం రోజుల తర్వాత భావన మళ్లీ నీతూపై దాడి చేసింది. ఆమె సామాన్లు బయటపడేసి, ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని చెప్పింది. దీంతో.. తాను రోడ్డెక్కాల్సి వచ్చిందని నీతూశర్మ బోరుమంది. తనపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీసులను నీతూశర్మ కోరింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. భావన, ఆమె స్నేహితురాలు పూనంతో పాటు సోనూ, మోనులను సైతం అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్స్ 354, 354(సి), 323, 380 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
