Hyderabad : డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి మృతి..తల్లి పరిస్థితి విషమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో విషాద ఘటన వెలుగు చూసింది.. కారు నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది.. నడిరోడ్డుపై కారు ఆపడమే కాదు వెనకా ముందు చూసుకోకుండా డోర్ తియ్యడంతో ఈ ప్రమాదం జరిగింది.. భార్యాభర్తలు కూతురితో కలిసి బైక్ పై వెళుతుండగా కారు డోర్ తగిలి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతిచెందగా తల్లి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. చిన్నారి తండ్రి మాత్రం గాయాలతో బయటపడ్డారు.. ఈ విషాదకర ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది..
ఎల్బీనగర్-మన్సురాబాద్ మార్గంలో రెండేళ్ళ ధనలక్ష్మి తల్లిదండ్రుల తో కలిసి బైక్ పై వెళుతోంది. అయితే ఇదేమార్గంలో వెళుతున్న ఓ కారును డ్రైవర్ సడన్ గా రోడ్డుపై ఆపాడు. కారులోంచి ఓ వ్యక్తి దిగి వెళ్లిపోగా ఏదో పనిపై డ్రైవర్ కిందకు దిగేందుకు ప్రయత్నించాడు. వెనకాల బైక్ వస్తున్న విషయాన్ని గమనించకుండా కారు డోర్ తియ్యబోయ్యాడు.. అంతే బైక్ డోర్ కు గుద్దుకుంది.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
రెండేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. చిన్నారి తల్లి శశిరేఖ కూడా తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. తండ్రి సయ్యద్ మాత్రం స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడినుండి పరారయ్యాడు..ఇక ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు..
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!