Site icon NTV Telugu

Husband Tortured Wife: కీచక భర్త.. చంపుతానని బెదిరించి వ్యభిచారంలోకి..

Husband Tortured Wife

Husband Tortured Wife

Husband Tortured Wife To Do Adultery For Money: కడదాక తోడుంటానని, ఏ కష్టం రాకుండా సంతోషంగా చూసుకుంటానని అతడు మాటిచ్చాడు. అతని మాటల్ని నమ్మి, తాను కోరుకున్న ఒక మంచి భాగస్వామి దొరికాడనుకొని పెళ్లి చేసుకుంది. తీరా పెళ్లి అయ్యాక.. అతడు తన నిజస్వరూపం చూపించాడు. తాను పెళ్లి చేసుకుంది ఒక వ్యక్తిని కాదు, నరరూప రాక్షసుడినని ఆమె ఆలస్యంగా తెలుసుకుంది. చంపుతానని బెదిరింది మరీ.. ఆమెని వ్యభిచారం రొంపిలోకి దింపాడు. ఆమె పోలీసుల్ని ఆశ్రయించేదాకా.. ఆ కీచకుడు వదిలిపెట్టలేదు. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే..

చాంద్రాయణగుట్టకు చెందిన సాదిక్‌(34)కు 2019లో పహాడీషరీఫ్‌కు చెందిన ఓ మహిళ(25)తో వివాహం అయ్యింది. అతనికి ఇది రెండో వివాహం. పెళ్లి కాకముందు.. తాను బాగా చూసుకుంటానని మాయమాటలు చెప్పడంతో, ఆమె నమ్మి వివాహమాడింది. కానీ, పెళ్లి అయ్యాక అతడు వేధించడం మొదలుపెట్టాడు. డబ్బుల కోసం ఆమెతో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టాడు. తనకు ఇష్టం లేదని చెప్తే.. చంపుతానని బెదిరించేవాడు. దీంతో.. ఆమె భయపడి, భర్త చెప్పినట్టుగానే వ్యభిచారం చేస్తూ వచ్చింది. ఒక బాబు పుట్టిన తర్వాత కూడా ఆ కీచకుడు మారలేదు. ఇళ్లు గడవాలంటే.. ఆ పని చేయాల్సిందేనని ఒత్తిడి చేశాడు. ఎంత నచ్చజెప్పినా, భర్తలో మార్పు రాకపోవడంతో.. ఆ మహిళ ఈ ఏడాది మార్చి నెలలో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కూడా అతడు ఆమెని విడిచిపెట్టలేదు.

ఈ నెల 2వ తేదీన ఆ మహిళ తన స్నేహితులతో కలిసి సరూర్‌నగర్ పరిధిలో కనిపించగా.. సాదిక్ ఆమె వద్దకు వెళ్లి కొట్టాడు. వెంటనే ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదైంది. అంతటితో ఆగకుండా.. గురువారం భార్య లేని సమయంలో అత్తారింటికి వెళ్లి, అత్తని బెదిరించి, కుమారుడ్ని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. అప్పుడు బాధితురాలు మళ్లీ ఫిర్యాదు చేయగా.. పహాడీషరీఫ్‌ పోలీసులు అతనిపై బలవంతపు వ్యభిరారం, కిడ్నాప్‌ కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. బాలుడ్ని కుటుంబ సభ్యులకి తిరిగి అప్పగించారు.

Exit mobile version