Crime News:ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు హత్యలకు దారితీస్తున్నాయి. క్షణికావేశంలో వారు చేస్తున్న పనులకు కుటుంబం రోడ్డున పడుతోంది, పిల్లలు అనాధులుగా మారుతున్నారు. భార్యను భర్త, భర్తను భార్య.. హత్య చేసి జైలుకు వెళ్లడంతో పిల్లలు జీవితాంతం హంతకుల బిడ్డలుగా పెరిగి వారు కూడా హంతకులుగా మారుతున్నారు. కూరలో ఉప్పు ఎక్కువయిందని ఒకరు.. చికెన్ కూర సరిగా వండలేదని మరొకరు.. శృంగారానికి పనికిరాదని ఒకరు.. అసలు శృంగారానికి ఒప్పుకోవడం లేదని ఇంకొకరు భార్యలను హతమారుస్తున్నారు. తాజాగా ఒక భర్త.. తన భార్య ఒక రాత్రిలో రెండో రౌండ్ శృంగారానికి నిరాకరించిందని నిర్దాక్షిణ్యంగా గొంతు కోసి చంపిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని అర్మోహ జిల్లాలో 34 ఏళ్ల మొహమ్మద్ అన్వర్, 30 ఏళ్ల భార్య రుక్సార్ నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే డిసెంబర్ 5 రాత్రి ఈ జంట శృంగారంలో పాల్గొన్నారు. అనంతరం నిద్రపోయారు. అయితే మొహమ్మద్ అన్వర్ కు రెండోసారి భార్యతో శృంగారం చేయాలనిపించింది. వెంటనే భార్యను నిద్రలేపాడు. కానీ, నిద్రమత్తులో ఉన్న ఆమె రెండోసారి శృంగారానికి నిరాకరించింది. దీంతో కోపోద్రేకుడైన మొహమ్మద్ అన్వర్.. వంటగదిలోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి నిద్రలో ఉన్న భార్య గొంతుకోసి హత్యచేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని పాలిథిన్ కవర్ లో చుట్టి ఊరి చివరన విసిరేసి వచ్చాడు. తర్వాత ఏమి తెలియనివాడిలా పోలీసుల వద్దకు వెళ్లి తన భార్య మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేశాడు. ఇక ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులకు రెండు రోజుల క్రితం రుక్సార్ మృతదేహం దొరికింది. దీంతో మొహమ్మద్ అన్వర్ నే అనుమానించిన పోలీసులు తమదైన పద్దతిలో విచారించగా తానే తన భార్యను హతమార్చినట్టు ఒప్పుకున్నాడు. శృంగారానికి అంగీకరించకపోయేసరికి కోపంలో హత్య చేసినట్లు తెలిపాడు. హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు అతడికి కోర్టుకు తరలించారు.
