Husband Forced His Wife To Sleep With His Friend For Money: ‘కష్టసుఖాల్లో నీకు తోడుగా ఉంటా, ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ప్రేమగా చూసుకుంటా’నంటూ అతడు అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాడు. కానీ, కొన్ని రోజుల తర్వాత తన నిజస్వరూపం బయటపెట్టాడు. అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఒకవేళ కట్నం తీసుకురాకపోతే, తన స్నేహితుడితో పడకగది పంచుకోమంటూ నీచంగా ప్రవర్తించాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ సంఘటన శంషాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివారాల్లోకి వెళ్తే..
శంషాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి(35)కి 2016లో ఓ మహిళ(27)తో వివాహం అయ్యింది. పెళ్లి సమయంలో రూ. 5 లక్షల నగదు, 9 తులాల బంగారు ఆభరణాల్ని కట్నంగా ఇచ్చారు. వీటితోపాటు విలువైవ గృహోపకరణాలనూ సమర్పించారు. ఓ వ్యాపారి కావడంతో, తమ కూతురిని ప్రేమగా చూసుకుంటాడని వధువు తల్లిదండ్రులు ఎంతో నమ్మారు. ఆ నమ్మకానికి తగినట్లుగానే, పెళ్లైన కొత్తలో మంచి అల్లుడిగా నటించాడు. భార్యను సైతం ఇబ్బందులు పెట్టకుండా, ప్రేమగా చూసుకున్నాడు. అది చూసి, తమ కూతురిని మంచి భర్త దొరికాడని తల్లిదండ్రులు, ఆ మహిళ ఆనందంతో ఉప్పొంగిపోయారు. కానీ, ఆ తర్వాత అతని అసలు స్వరూపం చూసి, నిర్ఘాంతపోయారు. కొంతకాలం నుంచి అతడు ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరగడం మొదలుపెట్టాడు. విపరీతంగా ఖర్చులు చేయడం ప్రారంభించాడు.
ఈ నేపథ్యంలోనే డబ్బుల్లేక, అదనపు కట్నం కోసం భార్యని వేధించసాగాడు. తాను కట్నం తీసుకురానని భార్య తిరగబడేసరికి.. ఆమెకి తెలియకుండా పడకగదిలో భార్య అశ్లీల వీడియోలను ఫోన్‌లో రికార్డ్ చేశాడు. వాటిని తన స్నేహితుడికి పంపాడు. ఈ విషయంపై భర్తని నిలదీస్తే.. ‘కట్నం తీసుకురా లేకపోతే స్నేహితుడితో పడుకో’ అంటూ ఒత్తిడి చేయసాగాడు. అత్తమామల దృష్టికి తీసుకెళ్తే, వాళ్లూ కొడుకు నిర్వాకాన్ని సమర్థించారు. భర్త బంధువులు కూడా దాడి చేశారు. దీంతో వేధింపులు భరించలేక ఆమె శంషాబాద్ పోలీసుల్ని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. భర్త, అత్తమామలతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
