Site icon NTV Telugu

Guntur Midnight Chaos: గుంటూరులో అర్థరాత్రి యువకుల వీరంగం.. నడి రోడ్డుపై దారుణం

Gnt

Gnt

Guntur Midnight Chaos: గుంటూరులో అర్ధరాత్రి సమయంలో యువకులు వీరంగం సృష్టించారు. నడి రోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా చితకబాదారు. లక్ష్మీపురంలో అర్ధరాత్రి సమయంలో మెయిన్ రోడ్డుపై ఒక యువకుడిని కొంత మంది మధ్య గొడవ జరిగింది. దీంతో యువకులందరూ కలిసి నడి రోడ్డుపైనే ఇష్టం వచ్చినట్లు అతడ్ని కొట్టారు. కిందపడినా వదలకుండా కొట్టారు. నడి రోడ్డుపై జరిగిన ఘటనతో జనం తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు.

Read Also: Winter : వణుకు పుట్టించే చలి వెనుక.. దాగున్న ఆరోగ్య రహస్యాలేంటి?

ఇక, ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో.. సంఘటన ప్రదేశానికి చేరుకోగానే యువకులు అక్కడి నుంచి పరారీ అయ్యారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని వీరంగం సృష్టించిన యువకులను పట్టుకునే పనిలో పడ్డారు. కాగా, ఈ అర్ధరాత్రి హల్ చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Exit mobile version