Site icon NTV Telugu

Wife Extramarital Affair: భార్య వివాహేతర సంబంధం.. పిల్లలు దూరం.. భర్త ఆత్మహత్య

Man Commits Suicide

Man Commits Suicide

Guduru Shekhar Commits Suicide Becuase Of Wife Extramarital Affair: భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడం, పిల్లల్ని కూడా దగ్గరికి రానీయకపోవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సరూర్‌నగర్‌కు చెందిన గూడూరు శేఖర్‌కు 2014లో నాగాంజలి అనే మహిళతో వివాహం అయ్యింది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నాగాంజలి ప్రస్తుతం ఆదిలాబాద్‌లోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పని చేస్తోంది. కట్ చేస్తే.. హైదరాబాదు నాంపల్లిలో పని చేసే సమయంలో నా బార్డ్ ఉద్యోగి స్వరూప్ రెడ్డితో నాగాంజలి వివాహేతర సంబంధం పెట్టుకుంది. నాలుగేళ్లుగా ఎవ్వరికీ తెలియకుండా.. వీళ్లిద్దరు రహస్యంగా తమ సంబంధాన్ని కొనసాగించారు. అయితే.. కొన్నాళ్ల క్రితం వీళ్లిద్దరిని భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. పెద్ద సమక్షంలో పంచాయతీ కూడా పెట్టించాడు.

ఈ పంచాయతీ జరిగాక స్వరూప్ రెడ్డి ఆదిలాబాద్‌కు బదిలీ చేయించుకొని వెళ్లిపోయాడు. అదే సమయంలో నాగాంజలి కూడా ఆదిలాబాద్‌కు బదిలీ చేయించుకుంది. తన పిల్లల్ని భర్త దగ్గరికి పంపించకుండా.. పుట్టింటికి పంపించింది. పిల్లల కోసం శేఖర్ ఎన్నిసార్లు వెళ్లినా.. వాళ్లను చూపించేందుకు నాగాంజలి ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శేఖర్.. ఈనెల 8వ తేదీన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పాటు తన పిల్లల్ని దగ్గరికి రానివ్వడం లేదన్న మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ సెల్ఫీ వీడియోలో శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స కోసం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి పంపించినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ అతను మరణించాడు. శేఖర్ చివరిసారిగా ఇచ్చిన స్టేట్మెంట్‌తో పాటు అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన గురించి తెలిసి.. నాగాంజలి, ఆమె పేరెంట్స్‌తో పాటు స్వరూప్ రెడ్డి పరారయ్యారు. పోలీసులు వీరి కోసం గాలిస్తున్నారు.

Exit mobile version