రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన ఓ యువకుడు కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురయ్యారు కుటుంబ సభ్యులు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్‌పహాడ్ కు చెందిన చేపూరి ప్రతాప్ గౌడ్ కు ఈ నెల 16న పెళ్లి జరగాల్సి ఉంది… అయితే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు.
Read Also: Baal Aadhaar: బాల్ ఆధార్ కోసం దరఖాస్తు చేస్తున్నారా.. అయితే ఇలా చేయండి..
పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళ్‌పహాడ్ కు చెందిన చేపూరి ప్రతాప్ గౌడ్ ఈ నెల 16 న ఓ యువతితో వివాహం జరగాల్సి ఉంది. అయితే నారాయణ గౌడ్ చిన్న కుమారుడైన ప్రతాప్ గౌడ్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. పెళ్లి పనులతో ఇంట్లో అంతా ఆనందోత్సవాల్లో ఉండగా అంతకుముందు రోజు సోమవారం సాయంత్రం నుంచి ప్రతాప్ గౌడ్ కనిపించకుండా పోయాడు.కుటుంబ సభ్యులు తీవ్రంగా వెతికినా ఆచూకీ దొరకలేదు. గ్రామ శివారులోని గుట్ట ప్రాంతంలో ప్రతాప్‌కు చెందిన బైక్ కనిపించింది. దీంతో అటు వైపు వెతికారు. అయితే ఆ గట్టపై ఉన్న ఓ చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ప్రతాప్ గౌడ్. దీంతో మృతుడి కుటుంబంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.
Read Also:Sweet Potatoes: చిలగడ దుంపలు తినడం వల్ల ఎన్ని లాభాయిన్నాయో.. మీకు తెలుసా..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. అనంతరం తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అసలు ప్రతాప్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని.. పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఇది ఆత్మహత్యా..? హత్యా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
