NTV Telugu Site icon

Love Tragedy: తన ప్రేమని అంగీకరించలేదని.. నడిరోడ్డుపైనే..

Girl Shot Dead

Girl Shot Dead

Girl Shot Dead In Uttar Pradesh Bhadohi After She Turned Down Proposal: ప్రేమ పేరుతో కొందరు యువకులు రెచ్చిపోతున్నారు. ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. తమకు ప్రేమ, దోమా నచ్చవని చెప్పినా.. ప్రేమించాల్సిందేనంటూ వెంటపడుతున్నారు. ఒప్పుకోకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొందరైతే హద్దుమీరి.. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇప్పటికే తమ ప్రేమను అంగీకరించలేదని.. అమ్మాయిల్ని ప్రేమోన్మాదులు చంపిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా అలాంటి దారుణమే మరొకటి వెలుగుచూసింది. తన ప్రేమని తిరస్కరించిందన్న కోపంతో.. ఓ యువకుడు 15 ఏళ్ల మైనర్‌ని నడిరోడ్డుపై కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో బదోహిలో చోటు చేసుకుంది.

Fake Website: అచ్చం ప్రభుత్వ పోర్టల్‌లాగే నకిలీ వెబ్‌సైట్.. మోసగాళ్ల ముఠా అరెస్ట్

ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆనంద్ విశ్వకర్మ (22) అనే యువకుడు కొంతకాలం నుంచి అనురాధ బింద్ (15) అనే మైనర్ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తూ వస్తున్నాడు. నువ్వంటే ఇష్టమని, నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడ్డాడు. తనకు ఇష్టం లేదని, తన వెంట పడొద్దని ఆ యువతి ఎన్నిసార్లు చెప్పినా.. అతడు విడిచిపెట్టలేదు. తనను ప్రేమించాల్సిందేనంటూ పట్టుబడ్డాడు. ఎక్కడికి వెళ్లినా సరే, వెంటనే అక్కడ ప్రత్యక్ష్యమై ఆమెని వేధించేవాడు. అయితే.. ఆ అనురాధ మాత్రం అతని ప్రేమని అంగీకరించలేదు. దీంతో పగ పెంచుకున్న ఆనంద్.. తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదనుకొని, ఆమెని చంపాలని నిర్ణయించుకున్నాడు. నిన్న(18-01-23) తన కజిన్ నిషాతో కలిసి కోచింగ్ సెంటర్ నుంచి అనురాధ ఇంటికి వెళ్తుండగా.. దారిలో ఆనంద్ అడ్డగించాడు.

Jacqueline Fernandez: అతడు నా కెరీర్‌ని నాశనం చేశాడు.. జాక్వెలిన్ ఆవేదన

అక్కడ మరోసారి ప్రేమ ప్రస్తావన తీసుకొచ్చాడు. మరోసారి ఆ యువతి తిరస్కరించింది. దీంతో కోపాద్రిక్తుడైన ఆనంద్, తనతోపాటు తెచ్చుకున్న తుపాకీ తీసి కాల్చి చంపాడు. అనురాధ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఎవరు చంపారనే విషయాన్ని ఆరా తీసి.. ప్రేమోన్మాది ఆనంద్ విశ్వకర్మ ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తేల్చారు. తన ప్రేమను తిరస్కరించడం వల్లే ఆనంద్ చంపాడని ఎస్పీ అనిల్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Viral Video: పెళ్లి వేడుకల్లో అపశృతి.. డ్యాన్స్‌ చేస్తూనే కుప్పకూలిన యువకుడు

Show comments