Site icon NTV Telugu

Tamilanadu: కంటతడి పెట్టిస్తున్న ఘటన.. బిడ్డ శవాన్ని 10 కిమీ మోసుకెళ్లిన తల్లి..

Tamilanadu

Tamilanadu

మానవత్వం అనే మాట రాను రాను కనుమరుగయ్యే పరిస్థితులు ఈ మధ్య వెలుగు చూస్తున్నాయి.. డబ్బులకు విలువిస్తున్నారు కానీ మనిషి ప్రాణాలకు మాత్రం విలువ లేకుండా పోతుంది.. చేతిలో డబ్బులు లేక కూతురు శవాన్ని చేతుల మీద 10 కిలో మీటర్లు మోసుకెళ్లిన ఘటన ఒకటి వెలుగు చూసింది.. అందుకు సంబందించిన ఫోటో ఒకటి వైరల్ కావడంతో ఈ వార్త వైరల్ అవుతుంది..

వివరాల్లోకి వెళితే.. ఈ హృదయ విదారక ఘటన తమిళనాడులో వెలుగు చూసింది.. తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.. బయట ఆడుకుంటున్న బాలికను పాముకరిచింది..అది గమనించిన తల్లి.. చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు…సరైన రవాణా సౌకర్యం లేక చేతుల మీద మోసుకెళ్లారు.. దారి మధ్యలోనే బాలిక ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకొని వెనుతిరిగారు.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు..

పోస్టుమార్టం నిమిత్తం ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ ను పంపించారు.. బాలిక శవంతో కుటుంబ సభ్యులు కూడా అంబులెన్స్ ఎక్కారు. అయితే కొండ ప్రాంతం నుంచి తమ గ్రామానికి రాకపోకలు సాగించలేకపోవడంతో అంబులెన్స్ వారిని గమ్యస్థానానికి 10 కిలోమీటర్ల దూరంలో దింపేశారు..ఇక చేసేదేమి లేక ఏడుస్తూ మృతదేహన్ని మోసుకొని వెళ్ళారు.. ఇందుకు సంబందించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..ఈ ఘటన పై అధికారులు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి..

 

Exit mobile version