GANJAI DRINK: హోలి వేడుకలే టార్గెట్‌గా గంజాయి దందా..
- హోలి వేడుకలే టార్గెట్‌గా గంజాయి దందా కుల్ఫీ.. బర్ఫీ.. చాక్లెట్లతో భంగ్ రూపంలో గంజాయి విక్రయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GANJAI DRINK: మరికొన్ని రోజుల్లో హోలీ పండగ రాబోతోంది !! హోలీ కోసం అందరూ రంగులు, స్ప్రే లు సిద్ధం చేస్తుంటే… ఇక్కడో కేటుగాడు గంజాయి డ్రింక్ రెడీ చేస్తున్నాడు. హోలీ రోజు కొన్ని ప్రాంతాల్లో భంగ్‌కి భలే డిమాండ్ ఉంటుంది. ఇదే అదునుగా.. గంజాయి కలిపిన భంగ్ సిద్ధం చేసి క్యాష్ చేసుకోవాలనుకున్నాడో వ్యాపారి. కానీ.. కథ అడ్డం తిరిగి.. ఎక్సైజ్ శాఖ నిఘాలో అడ్డంగా దొరికిపోయాడు. ఏకంగా కుల్ఫీ.. బర్ఫీ.. చాక్లెట్లతో భంగ్ రూపంలో గంజాయి విక్రయాలు జరిపేందుకు ప్లాన్ చేశారు. చార్మినార్ పరిధిలోని ఉప్పుగూడను అడ్డాగా చేసుకుని వీటిని తయారు చేసి.. అమ్మకానికి సిద్ధం చేశారు. హోలీ ఈవెంట్లలో వీటిని అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించారు.
హోలీ రోజు జోరుగా మత్తుపదార్ధాల అమ్మకాలు
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
అసలే హోలీ పండగ..! రంగుల్లో మునిగి తేలాల్సిందే..! ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఈవెంట్స్.. ఇలా రకరకాలుగా కొందరు ఎంజాయ్ చేస్తుంటే.. మరికొందరి రూటే సపరేట్!! పండగేదైనా… సందర్భం ఏదైనా.. మత్తులో చిత్తవ్వాల్సిందే అనుకుంటారు కొందరు. అందులోనూ.. ఫుల్ టూ ఎంజాయ్‌మెంట్ ఉండే హోలీ రోజు నిషా నషాళానికి ఎక్కాల్సిందే అనుకుంటారు మత్తుబాబులు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే.. హోలీ రోజు మద్యం షాపులు, బార్‌లు మూసేయిస్తారు పోలీసులు. చివరకు కల్లు కాంపౌండ్‌లను కూడా బంద్ పెడతారు. హోలీ రోజు తప్పతాగి.. అమాయకుల ప్రాణాలు బలిగొంటున్న వారికి చెక్ పెడుతున్నారు. అయినా సరే… హోలీ రోజు మత్తుపదార్ధాల అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతుంటాయి. ఎవరికీ అనుమానం రాకుండా… గుర్తు పట్టలేని రూపాల్లో మాదకద్రవ్యాలను విక్రయింస్తుంటారు కేటుగాళ్లు.
పేరుకే తండాయి… కానీ గ్లాస్ నిండా గంజాయి
ఉత్తరప్రదేశ్‌కి చెందిన బి. వికాస్ శర్మ… చుడి బజార్, బేగం బజార్ పరిధిలో తండాయి పాలు అమ్ముతుంటాడు. అందులోనే బర్ఫీలు, కుల్ఫీలు కూడా విక్రయిస్తుంటాడు. హోలీ రోజు గంజాయికి డిమాండ్ ఎక్కువగా ఉండటాన్ని గ్రహించి.. తాను రెగ్యులర్‌గా తయారు చేసే కుల్ఫీలు, బర్ఫీలు, తండాయిలో గంజాయిని కలిపి తయారు చేశాడు. చూస్తే… ఏమాత్రం అనుమానం రాకుండా… సాధారణ కుల్ఫీలు, బర్పీల మాదిరిగా అనిపించేలా విక్రయించి సొమ్ము చేసుకుందాం అనుకున్నాడు. వేడి చేసి చల్లార్చిన పాలలో ఐస్, డ్రైఫ్రూట్స్ వేసి… 50 రూపాయలకు ఒక గ్లాస్ చొప్పున అమ్ముతుంటాడు. వికాస్ శర్మపై నిఘా పెట్టిన ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌టీమ్… గంజాయి కుల్ఫీలు, బర్ఫీలు, తండాయి అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
1920 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 9.6 కేజీల గంజాయి మిక్స్ అయినట్లు గుర్తించారు పోలీసులు. 50 రూపాయలకు అమ్మే తండాయి గ్లాస్‌లో గంజాయి కలిపి.. 150 రూపాయలకు ఒక గ్లాస్ చొప్పున అమ్మాలని సిద్ధం చేసి ఉంచుకున్నాడు. వికాస్ శర్మ మాదిరిగా ఇంకా ఎవరైనా గంజాయి మిశ్రమాలను విక్రయించారా..? వికాస్ శర్మ ఎవరికైనా బల్క్‌లో అమ్మకాలు జరిపాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు ఎక్సైజ్ అధికారులు. గంజాయిని ఏ రూపంలో అమ్మాలని చూసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
-
AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
-
Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్‌పై కీలక ఆదేశాలు.!
-
Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!