NTV Telugu Site icon

Sangareddy Crime: లారీని వెనుకనుంచి ఢీకొట్టిన బైక్.. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి

Sangareddy Crime

Sangareddy Crime

Sangareddy Crime: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాందేడ్- అఖోలా నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని వెనుక నుంచి బైక్ ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కంది మండలం తునికిళ్ళ తండా వద్ద జరిగింది.

Read also: KCR : నేడు తెలంగాణ బడ్జెట్‌.. ప్రతి పక్షనేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్‌..?

కంది మండలం తునికిళ్ళ తండా వద్ద లారీని ఒక పక్కకు లారీని ఆపాడు డ్రైవర్. వర్షం కురుస్తుండటంతో పక్కకు లారీని పక్కకు ఆపి కాసేపు తరువాత బయలు దేరుదామని అనుకున్నాడు. ఇంతలోనే లారీ వెనుక నుంచి పెద్ద శబ్దం. ఏమైందని లారీ డ్రైవర్ కిందికి దిగి చూసే సరికి యుగ్గురు యువకులు లారీ వెనుకల రోడ్డుపై చెల్లా చెదురై పడి వున్నారు. డ్రైవర్ షాక్ తిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. కానీ పోలీసులు చేరుకునే సరికి ముగ్గరు యువకులు అప్పటికే మృతి చెందారు. అయితే డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేశారు.

ఈ ముగ్గురు యువకులు అతి వేగంతో బైక్ నడపడం వలనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతి చెందిన ముగ్గురు యువకులు కందిలోని అక్షయ పాత్ర కిచెన్ లో పని చేస్తున్నట్లు గుర్తించారు. మృతులు పుల్కల్ మండలం ఇసాజి పేట, గంగోజిపేట వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కొరకు సంగారెడ్డి లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను ఈ సమాచారం అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అసలే వానాకాలం ఈపరిస్థితుల్లో వాహనదారులు దారుల్లో వెల్లేప్పుడు జాగ్రత్తగా బండ్లను నడపాలని సూచించారు. వర్షాకాలంలో వాహనాలు స్పీడ్ గా నడపరాదని, రోడ్డుపై నడిపేటప్పుడు తగు జాగ్రత్తగా నడపాలని తెలిపారు. రోడ్డులపై పక్కకు వాహనాలు ఉంటాయని దానిని గమనించి ప్రయాణించాలని సూచించారు.
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. పోలవరం విషయంలో కీలక చర్చ