Site icon NTV Telugu

Nandyal Murder: భార్యా భర్తల మధ్య వివాదం.. భర్తను దారుణంగా హత్య చేసిన బంధువులు..!

Crime

Crime

Nandyal Murder: దంపతుల మధ్య నెలకొన్ని వివాదాన్ని పరిష్కరించేందుకు వచ్చిన బంధువులే.. భర్త ప్రాణాలు తీసిన ఘటన కలకలం రేపుతోంది.. నంద్యాల అరుంధతీ నగర్ లో పెద్దన్న అనే వ్యక్తిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. బంధువులే హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. నంద్యాల జీజీహెచ్‌లో పెద్దన్న అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నారు. అర్ధరాత్రి దాటాక భార్య, భర్తల విషయంలో పెద్దన్న , అతని బంధువుల మధ్య వివాదం తలెత్తింది.రోడ్లపై గుంపులు గుంపులుగా కొట్టుకున్నారు. పెద్దన్నను కత్తులతో పొడిచిన రాజు, అతని బంధువులు హత్య చేశారు. పెద్దన్నకు సపోర్టు గా వచ్చిన ఉప్పరిపేటకు చెందిన సురేష్ పై కూడా రాజు, అతని బంధువులు కత్తులతో దాడి చేశారు. సురేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు.. అయితే, మొత్తంగా భార్యాభర్తల మధ్య వివాదాల పరిష్కారం కోసం వచ్చిన బంధువులే.. సదరు వ్యక్తిని దారుణంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది..

Read Also: Akhanda2 Censor Review : అఖండ 2 సెన్సార్ టాక్.. శివ తాండవమే

Exit mobile version