Site icon NTV Telugu

Fake Parking Scam: మెట్రో దగ్గర ఫేక్ దందా..పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న నకిలీ సిబ్బంది..

Untitled Design (9)

Untitled Design (9)

ప్రజలను బురిడీ కొట్టించేందుకు.. నకిలీ రాయుళ్లు ఎక్కడిపడితే అక్కడ రెడీగా ఉంటున్నారు. ఢిల్లీలోని జనక్ పురి ఈస్ట్ మెట్రో స్టేషన్ వ్యక్తి.. వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీంతో నకిలీ వసూళ్ల పర్వం బయటపడిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: Credit Card : క్రెడిట్ కార్డ్ లపై లోన్ తీసుకుంటున్నారా.. అయితే బీ అలెర్ట్..

అయితే.. ఇలాంటి బురీడీ రాయుళ్లు ప్రతినిత్యం మనకు ఎక్కడో ఓ చోట తారసపడుతుంటారు. ప్రతి ఒక్క చోట వీళ్ల దందాలు చేస్తూంటారు. తాజాగా ఢిల్లీలోని జనక్ పురి ఈస్ట్ మెట్రో స్టేషన్ లో డబ్బులు వసూలు చేస్తూ.. కనిపించాడు. కారులో వెళుతున్న ఓ వ్యక్తిని ఆపి పార్కింగ్ ఫీజు చెల్లించాలంటూ.. అతడి దగ్గర ఉన్న క్యూర్ ఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ పంపాలన్నాడు. అయితే కారులో ఉన్న వ్యక్తి.. ఆ క్యూఆర్ కోడ్.. అతడి పర్సనల్ అకౌంట్ కు లింక్ ఉండడంతో.. అతడి నకీలీ దందా బయట పడింది. కారులో ఉన్న వ్యక్తి డబ్బులు ఇవ్వనని చెప్పాడు.. సదరు వ్యక్తి.. కారులో ఉన్న వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు.

Read Also:Schedule Feature: వాట్సాప్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అందుబాటులోకి కొత్త ఫీచర్..

అయితే అక్కడే ఉన్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ మిషన్‍ను స్వాధీనం చేసుకున్నారు. పార్కింగ్ ఫీజు .. మెట్రో యాజమాన్యానికి చేరకుండా.. ఇలా అక్కమార్కుల జేబులోకి వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

Exit mobile version