Cyber Scam: ప్రస్తుతం సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ప్రజలను మోసం చేసేందుకు అనేక రూపాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సైబర్ మోసం కథ వింటే ఎవరికైనా షాక్ తగలక తప్పదు. ఈసారి సైబర్ నేరస్తులు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరున్న ఎలాన్ మస్క్ పేరును ఉపయోగించి ఓ మహిళను మోసం చేశారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్. అలాంటి పేరు చెప్పుకుంటూ మోసం చేయడం అంటే మోసగాడు పకడ్బందీగా ప్లాన్ వేశాడో తెలుస్తోంది. అసలు ఏం జరిగిందో పూర్తి కథను తెలుసుకుందాం..
READ MORE: Hindu Girl Forced Conversion: హిందూ బాలికను బురఖా ధరించాలని బలవంతం.. ఐదుగురు ముస్లీం అమ్మాయిలపై కేసు
ముంబైలోని ఈస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో జనవరి 20న ఓ ఫిర్యాదు నమోదైంది. గుర్తు తెలియని వ్యక్తులు మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆ మహిళను మోసం చేసి వ్యక్తి 2025 అక్టోబర్ నుంచి 2026 జనవరి మధ్యలో మొత్తం 16.34 లక్షల రూపాయలు దోచుకున్నాడు. ఈ మోసం సోషల్ మీడియా నుంచే మొదలైంది. X (ట్విట్టర్)లో ఒక అకౌంట్ ద్వారా ఆ మహిళతో చాటింగ్ మొదలుపెట్టాడు ఓ వ్యక్తి. తాను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్‌నని పరిచయం చేసుకున్నాడు. మొదట సాధారణంగానే చాటింగ్ చేసుకున్నారు. తర్వాత ఆ ఆగతంతకుడు ఆమెతను యాప్ డౌన్‌లోడ్ చేయమన్నాడు. ఆ యాప్ ద్వారా ఇద్దరి మధ్య చాటింగ్ మరింత దగ్గరగా కొనసాగింది. కొద్దిరోజుల్లోనే మాటలు కలల దాకా వెళ్లాయి. ఆమెను అమెరికాకు తీసుకెళ్తానని, అక్కడ విలాసవంతమైన జీవితం ఇస్తానని ఆశ చూపించాడు. ప్రపంచంలోనే గొప్ప వ్యక్తి తనతో మాట్లాడుతున్నాడన్న భావన ఆమెను పూర్తిగా నమ్మేలా చేసింది. ఆ మాటల మాయలో నెమ్మదిగా చిక్కుకుపోయింది.
READ MORE: Office Friends: 70 మంది ఆఫీస్ దోస్తులను పెళ్లికి పిలిస్తే ఒక్కరే హాజరు.. నిరాశతో జాబ్ రిజైన్!
ఇక్కడే అసలు కథ మొదలైంది. టికెట్, వీసా వ్యవహారాల కోసం జేమ్స్ అనే వ్యక్తితో మాట్లాడాలని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ తర్వాత జేమ్స్‌తో చాటింగ్ మొదలైంది. ఖర్చుల పేరుతో ఒక్కొక్కసారి డబ్బు అడగడం మొదలుపెట్టాడు. మొదట చిన్న మొత్తాలు కాజేశారు. తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు దోచేశారు. ఆ బాధితురాలు నమ్మకంతో డబ్బులు పంపుతూనే వచ్చింది. కొన్ని సందర్భాల్లో జేమ్స్ ఆమెను అమెజాన్ గిఫ్ట్ కార్డులు కొనమని చెప్పాడు. వాటి కోడ్స్ షేర్ చేస్తే ప్రాసెస్ వేగంగా పూర్తవుతుందని నమ్మబలికాడు. ఆమె కూడా ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేసి కోడ్స్ పంపింది. ఇలా చేస్తూ చేస్తూ లక్షల రూపాయలు చేతులెత్తాయి. కానీ ఒక దశలో జేమ్స్ మరోసారి ఇంకా 2 లక్షల రూపాయలు కావాలి అని అడిగాడు. దీంతో ఆమెకు అనుమానం మొదలైంది. ఇదే సమయంలో ఎలాన్ మస్క్ పేరుతో చాటింగ్ చేస్తున్న అకౌంట్ ఒక్కసారిగా ఆమె అకౌంట్‌ను బ్లాక్ చేసింది. దీంతో తాను మోసపోయానని ఆ బాధితురాలు లేట్‌గా గుర్తించింది. తనకు జరిగినదంతా తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దాంతో సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.
