Site icon NTV Telugu

ఆఫ్ఘ‌నిస్తాన్‌ను వ‌ణికించిన భూకంపం… 26 మంది మృతి…

ఆఫ్ఘ‌నిస్తాన్‌ను భూకంపం వ‌ణికించింది.  ప‌శ్చిమ ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని బాద్గిస్‌లో భూకంపం సంభ‌వించింది.  రిక్ట‌ర్ స్కేలుపై తీవ్ర‌త 5.3 గా న‌మోదైంది.  భూకంపం తాకిడికి వంద‌లాది ఇల్లు నేల‌మ‌ట్టం అయ్యాయి.  శిధిలాల కింద చిక్కుకొని 26 మంది మృతి చెందారు.  తుర్కుమెనిస్తాన్ స‌రిహ‌ద్దుల్లో ఉన్న బాద్గిస్ ప్రావిన్స్‌లో వ‌ర‌స‌గా రెండుసార్లు భూమి కంపించింది.  మొద‌టిసారి వ‌చ్చిన భూకంపం తీవ్ర‌త 5.3గా ఉండ‌గా, రెండోసారి వ‌చ్చిన భూకంపం తీవ్ర‌త 4.9గా న‌మోదైంది.  రెండు భూకంపాల ధాటికి వంద‌లాది ఇల్లు నేల‌మ‌ట్టం అయ్యాయి.   శిధిలాల కింద వంద‌లాది మంది చిక్కుకున్న‌ట్టు స‌మచారం.  చాలా మందికి గాయాల‌య్యాయి.  మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.  భూకంపం ధాటికి సుమారు 700ల‌కు పైగా ఇల్లు నేల‌మ‌ట్టం అయిన‌ట్టు అధికారులు చెబుతున్నారు.  

Read: ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్

Exit mobile version