NTV Telugu Site icon

Drugs Seized: మరోసారి డ్రగ్స్‌ కలకలం.. రూ.25 లక్షల విలువచేసే MDMA స్వాధీనం

Drugs Seized

Drugs Seized

Hyderabad Crime: హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ కలకలం రేపింది. పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హుమాయుంగార్‌లో స్థానిక పోలీసులతో కలిసి హెచ్‌ న్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు డ్రగ్స్‌ వ్యాపారులతోపాటు ఓ విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్‌ విలువ రూ.25 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం మీడియా ముందు హాజరు పర్చనున్నారు. డ్రగ్స్‌ లేని నగరంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేంకు పోలీసులు కృషి చేస్తున్నా డ్రగ్స్‌ రవాణాకు అడ్డుకట్టు వేయలేకపోతున్నారు. ఎక్కడో ఒకచోట డ్రగ్స్‌ పట్టుబడుతూనే ఉంది. దీనిపై దృష్టి సారించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు నగరవ్యాప్తంగా ఉక్కు పాదం మోపారు. కాలేజీలు, పబ్‌లు, విమానశ్రయాల వద్ద తనిఖీలు చేస్తూనే ఉన్నారు. అయినా పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్‌ రవాణా సాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి సంఘటనపై ఉక్కుపాదం మోపడంతో రోజూ ఎక్కడో అక్కడ పోలీసులు డ్రగ్స్‌ సీజ్ చేస్తూ, కేసు నమోదు చేస్తున్నారు. ఇప్పటికైనా డ్రగ్స్ రావాణాకు చెక్ పెట్టాలని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు.
Adilabad: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు.. క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర ఎంతంటే..