DRDO Manager: దేశ రక్షణకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ఒక గూఢచారిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. జైసల్మేర్‌లోని డీఆర్‌డీఓ గెస్ట్ హౌస్‌కు మేనేజర్‌గా పని చేస్తున్న మహేంద్ర ప్రసాద్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగిని.. పాకిస్థాన్‌కు చెందిన గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి దేశ రహస్యాలను లీక్ చేస్తున్నాడనే ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ దేశ రక్షణ వ్యవస్థలలోని భద్రతా లోపాన్ని బయట పెడుతోంది.
ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మహేంద్ర ప్రసాద్. పేరుకు రాజస్థాన్ జైసల్మీర్‌లోని DRDO గెస్ట్ హౌజ్‌కు మేనేజర్‌గా పని చేస్తున్నాడు. కానీ పక్కా దేశద్రోహి. మన దేశ రహస్యాలను శత్రుదేశం పాకిస్తాన్ గూఢచార సంస్థ ISIకి అందిస్తున్నాడు. దేశ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ..ఇలాంటి విషయం బయట పడడం పెద్ద చర్చగా మారింది.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజస్థాన్ సీఐడీ ఇంటెలిజెన్స్ దేశ వ్యతిరేక, విధ్వంసక కార్యకలాపాలపై నిఘా పెంచింది. ఈ సమయంలోనే.. ఉత్తరాఖండ్‍కు చెందిన 32 ఏళ్ల మహేంద్ర ప్రసాద్‌పై అనుమానాలు మొదలయ్యాయి. అతడు సోషల్ మీడియా ద్వారా నిరంతరం పాకిస్థానీ గూఢచార అధికారి ఒకరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా మహేంద్ర ప్రసాద్ తన సోషల్ మీడియాలో స్నేహితులతో ముచ్చటించే నెపంతో పాకిస్థానీ హ్యాండ్లర్‌తో చాట్ చేస్తున్నాడు. అంతే కాదు దేశానికి సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని షేర్ చేస్తున్నట్లు తెలుసుకున్నాయి నిఘా వర్గాలు.
Gujarat Honour Killing: చేజేతులా కన్నకూతుర్నే చంపేశాడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ముఖ్యంగా మహేంద్ర ప్రసాద్.. డీఆర్‍డీఓ శాస్త్రవేత్తలు, భారత సైనికాధికారుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా అతను పని చేస్తున్న చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఒక అత్యంత కీలకమైన సైనిక స్థావరం. ఇక్కడే క్షిపణులు, ఇతర ఆయుధాల పరీక్షలు జరుగుతాయి. అటువంటి కీలకమైన ప్రదేశానికి వచ్చే శాస్త్రవేత్తలు, అధికారులు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అనే సమాచారాన్ని పాకిస్థాన్‌కు అందిస్తున్నాడు. ఈ సమాచారం చేరవేయడం వల్ల దేశ భద్రత ప్రమాదంలో పడిందనే చెప్పవచ్చంటున్నారు పోలీసులు.
Off The Record: టీ-కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితులు? క్యాష్ చేసుకుంటున్న బీఆర్ఎస్
ఇక మహేంద్ర ప్రసాద్‍ను అదుపులోకి తీసుకున్న తర్వాత అతడి మొబైల్ ఫోన్‍ను పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో అతడు పాకిస్తాన్‌కు చెందిన ఎవరెవరితో సంభాషించాడు. ఏయే సోషల్ మీడియా హ్యాండ్లర్లు ఉపయోగించాడనే దానిపై ఆధారాలు లభించాయి. వాటి ఆధారంగానే అతన్ని అరెస్ట్ చేసి.. గూఢచర్యం కేసు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇంకెవరికైనా సంబంధం ఉందా? భద్రతా ఉల్లంఘన ఏ మేరకు జరిగింది? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
