Site icon NTV Telugu

Digital Arrest Scam: స్కామర్లకు మహిళా వైద్యురాలు బలి.. రూ.19 కోట్లు మాయం చేసిన కేటుగాళ్లు!

Digital Arrest Scam

Digital Arrest Scam

Digital Arrest Scam: గుజరాత్‌లోని ఓ మహిళా వైద్యురాలు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌కు గురి అయ్యింది. దీనితో తన జీవితాంతం సంపాదించిన రూ. 19 కోట్లు కేవలం 90 రోజుల్లోనే కోల్పోయింది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మార్చిలో మొదలైన ఈ మోసం అత్యంత ప్రణాళికతో జరిగినట్లు పోలీసు దర్యాప్తులో బయటపడింది. ఈ ఘటనలో మొదట డాక్టర్‌కు “జ్యోతి విశ్వనాథ్” అనే మహిళ ఫోన్ చేసి, తాను టెలికాం విభాగానికి చెందినవారని చెప్పింది. ఆ వెంటనే సబ్ ఇన్‌స్పెక్టర్ మోహన్ సింగ్, ప్రాసిక్యూటర్లు దీపక్ సైని, వేంకటేశ్వర్, నోటరీ పవన్ కుమార్ అనే నకిలీ వ్యక్తులు కూడా ఆమెను సంప్రదించారు.

Shubman Gill: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. ‘కింగ్’ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!

ఈ మోసగాళ్లు, ఆమె ఫోన్ నంబరు అసభ్యకర కంటెంట్ పంపించేందుకు ఉపయోగించబడుతోందని ఆరోపిస్తూ డాక్టర్ ఆధార్ వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం కోరారు. ఆ తర్వాత ఆమెను మనీ లాండరింగ్ కేసులో దోషిగా ముద్రించేలా బెదిరింనచడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరింపుల మధ్య, ఆమె మూడు నెలలలో రూ. 19 కోట్లు మొత్తం 35 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసింది. అంతే కాదు, తన బంగారంపై లోన్ తీసి దానిని కూడా మోసగాళ్ల ఖాతాల్లోకి జమ చేసింది.

IND vs ENG Test: వరణుడి ఎఫెక్ట్.. నిలిచిన ఆట! భారత్ స్కోర్ ఎంతంటే.?

ఈ మోసంపై డాక్టర్ జూలై 16న ఫిర్యాదు చేయగా, గుజరాత్ CID క్రైం విభాగం వెంటనే సైబర్ సెల్‌ ద్వారా దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న 30 ఏళ్ల లాల్‌జీ బల్దానియా అనే నిందితుడిని సూరత్‌లో అరెస్ట్ చేశారు. లాల్‌జీ ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థను నడుపుతూ.. మురళీధర్ మాన్యుఫాక్చరింగ్ పేరిట ఓ బ్యాంక్ ఖాతా ప్రారంభించాడు. ఆ ఖాతాలో స్కామ్‌తో సంబంధం ఉన్న కోటి రూపాయల నగదు జమ అయినట్లు గుర్తించారు. పోలీసుల విచారణలో లాల్‌జీ, నోయిడాలోని మోసగాళ్ల ముఠాతో పరిచయం ఏర్పడిందని తన బ్యాంక్ ఖాతాను వారు ఉపయోగించేందుకు అనుమతి ఇచ్చానని ఒప్పుకున్నాడు.

Exit mobile version