Delhi stabbing case: గత ఆదివారం ఢిల్లీలో సాక్షి అనే 16 ఏళ్ల అమ్మాయిని అత్యంత క్రూరంగా హత్య చేశాడు 20 ఏళ్ల సాహిల్ అనే వ్యక్తి. అత్యంత క్రూరంగా కత్తితో 16 సార్లు పొడిచాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న బండరాయితో మోది హత్య చేశారు. ఈ హత్య అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. తాజాగా బాలిక అటాప్సీ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికను ఎంత క్రూరంగా చంపాడనే విషయాలను ఈ నివేదిక వెల్లడించింది. పోలీసులు 16-17 పేజీల పోస్ట్‌మార్టం నివేదికను వైద్యులు అందించారు.
Read Also: Kishan Reddy : లింగాయత్ సమాజ్ డిమాండ్ నెరేవేర్చేందుకు కృషి చేస్తాం
ఢిల్లీలోని షహాబాద్ డెయిరీ ఏరియాలో 16 ఏళ్ల బాలికను పలుమార్లు పొడిచి హత్యచేశాడు సాహిల్. ఈ ఘటనలో ఆమె అంతర్గత అవయవాలు బయటకు వచ్చాయి. పేగులతో సహా ఇతర అవయవాలు బయటకు వచ్చినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. తల ప్రాంతంలో కొన్ని ఎముకల పగుళ్లు గాయాలు ఉన్నాయి. కత్తితో పొడిచి బండరాయితో తలను పగలగొట్టినట్లు నివేదిక వెల్లడించింది. భుజం, తుంటి భాగంలో ఎక్కువగా కత్తి పోట్లు ఉన్నాయి. పలు ప్రాంతాల్లో ఎముకలు విరిగిపోయాయి. బాలిక పుర్రె పగిలిపోయింది.
నేర జరిగిన ప్రదేశం నుంచి పోలీసులు కత్తి, బూట్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. నడిరోడ్డుపై ఇంత దారుణంగా హత్య జరుగుతున్నా.. ఒక్కరు కూడా ఆపేందుకు ప్రయత్నించలేదు. హత్య తరువాత నిందితుడు సాహిల్ ఉత్తర్ ప్రదేశ్ బులంద్ షహర్ ప్రాంతానికి పారిపోయాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని హత్య జరిగిన తర్వాత రోజు అరెస్ట్ చేశారు.
