Site icon NTV Telugu

Dandupalyam movie Effect: కదిరి దోపిడీ హత్య, కేసు

సినిమాలు కొంతమందిపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. అందులోనూ క్రైం కథాంశంతో వచ్చిన సినిమాల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనంతపురం జిల్లాలో ఓ కేసులో నేరగాడికి దండుపాళ్యం మూవీ ప్రేరణ అయింది. కదిరి దోపిడీ హత్యకేసులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. సినిమా చూసి హత్యతో పాటు దోపిడీ చేశాడు మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు.

దండుపాళ్యం సినిమా చూసిన తరువాత.. పక్కా పథకంతో హత్య, దోపిడీ చేశాడు. సంచలనం రేకెత్తించిన ఉపాధ్యాయురాలి హత్య కేసు ఛేదించారు పోలీసులు. మూడు నెలల పాటు పగలు రేయి అనకుండా శ్రమించాయి 8 ప్రత్యేక పోలీసు బృందాలు. 5 రాష్ట్రాలలో గాలించి… లక్షలాది ఫోన్ కాల్స్ విశ్లేషించారు. చివరకు 5 వేల మంది అనుమానితుల విచారణ పూర్తిచేశారు.

ఒక అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీల పర్యవేక్షణలో మొత్తం 30 మంది అధికారులు, సిబ్బంది సమిష్టి కఠోర శ్రమతో కొలిక్కి వచ్చింది కేసు. ఎట్టకేలకు కరుడుగట్టిన నిందితుడిని అరెస్టు చేశారు. ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 58 తులాల బంగారం, 97 వేల నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. కదిరి సబ్ డివిజన్ పరిధిలో 3 కేసులు, కర్నాటకలో 7 కేసుల్లో నిందితుడుగా వున్నాడు. బైకుల నుండి పెట్రోల్ దొంగలించడం మొదలుపెట్టి దండుపాళ్యం గ్యాంగ్ తరహాలో మర్డర్ చేశాడు నిందితుడు. ఇలాంటి సినిమాలు తీస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు.

https://ntvtelugu.com/iifl-manager-gold-cheating-case-filed/
Exit mobile version