హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఫలక్‌నుమా పరిధిలో డ్యాన్సర్ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. యువతి మృతదేహం నగ్నంగా పడేశారు దుండగులు. డ్యాన్సర్ పై అత్యాచారం జరిగిందా? లేక గ్యాంగ్ రేప్ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒంటిపై బట్టలు లేకుండా యువతి మృతదేహం నగ్నంగా పడేయడంతో దుండగులు ఆమెపై అత్యాచారం చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
యువతి పోన్ కాల్ డేటా ఆధారంగా మృతిపై దర్యాప్తు జరుగుతోంది. మృతి చెందిన యువతిని డ్యాన్సర్‌గా పోలీసులు గుర్తించారు. ఆమె వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. ఇటీవల కాలంలో మహిళలు, యువతులపై దుండగుల దాడులు, అఘాయిత్యాలు ఎక్కువ అయ్యాయి,