కొంతమందికి వృత్తి… ప్రవృత్తి ఒకటే వుంటుంది. మరికొందరికి చెప్పే వృత్తి ఒకటి.. చేసేది మరొకటి. హైదరాబాద్ పాతబస్తీలో బట్టల వ్యాపారము చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. అందులో విశేషం ఏముంది అదీ వ్యాపారమే కదా అనకండి. అక్కడే ట్విస్ట్ వుంది. వారు బట్టల వ్యాపారం మాటున కత్తులు,తల్వార్లను అమ్ముతున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వీరి నుండి తల్వారు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.
బండ్లగూడ, నూరినగర్, జహంగీరాబాద్ కు చెందిన మహమ్మద్ హుసేన్ బట్టల వ్యాపారి. మహమ్మద్ జావీద్ తలాబ్ కట్టా, అమాన్ నగర్ బీ చెందిన ఈ యువకుడు బట్టల షాపు సేల్స్ మేన్ గా ఉన్నాడు. వీరిద్దరు కత్తులు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులకు దిగారు. స్థానిక భవానీనగర్ పోలీసులతో కలిసి ఇద్దరిని అదుపులొకి తీసుకున్నారు. వారి నుంచి ఓ తల్వారు, 2 డ్రాగన్ కత్తులు, ఒక బటన్ కత్తితో పాటు నిక్కల్ పంచ్ ను స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కోసం భవానీనగర్ పోలీసులకు అప్పగించారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.
Jubilee Hills Gang Rape Case: ఇన్నోవా కారు స్వాధీనం.. వెలుగులోకి సంచలన విషయాలు
