Site icon NTV Telugu

Karnataka: ప్రేమించడం లేదని కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె దారుణహత్య..

Karnataka

Karnataka

Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో హుబ్బళ్లికి చెందిన ఓ యవతిని దారుణంగా నరికి చంపాడు. హుబ్బళ్లీ బీవీబీ కాలేజీలో చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థిని నేహా హిరేమత్‌ని ఫయాజ్ అనే వ్యక్తి చంపేశాడు. నేహా కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్ కుమార్తె. నిందితుడిని బెళగావి జిల్లా సౌదత్తికి చెందిన వాడిగా గుర్తించారు. నేహా చదువుతున్న కాలేజీలోనే ఫయాజ్ సీనియర్‌గా ఉన్నాడు.

గత కొంత కాలంగా ఫయాజ్ నేహాని ప్రేమించాలని ఒత్తిడి చేస్తున్నాడు. పలుమార్లు ఆమె ప్రేమను తిరస్కరించింది. అయినా కూడా వినకుండా ఆమెపై పగ పెంచుకున్న ఫయాజ్ గురువారం నేహపై దాడి చేసి హతమార్చాడు. ఆమె కళాశాల నుంచి బయటకు వచ్చే వరకు వేచి ఉన్న నిందితుడు, బయటకు రాగానే ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. కత్తితో దాడి చేసిన వెంటనే నిందితుడు క్యాంపస్ నుంచి పారిపోయాడు. పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Read Also: Kiran Kumar Reddy: మంత్రి పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్‌ సంచలన వ్యాఖ్యలు.. బహిరంగ సవాల్..

దాడి తర్వాత నేతను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమెను రక్షించడానికి వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఎమ్మెల్యే ప్రసాద్ అబ్బయ్య సహా కాంగ్రెస్ నేతలు ఆస్పత్రిని సందర్శించి నేహ కుటుంబాన్ని ఓదార్చారు. నేహా బీవీవీ కాలేజీలో ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. చాలా నెలలుగా నిందితుడు ఫయాజ్ ఆమెపై వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇటీవల అతను ఆమెకు ప్రపోజ్ చేయగా, తిరస్కరించింది. దీంతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ నగర విభాగం కళాశాల ఎదుట నిరసన చేపట్టాలని నిర్ణయించింది.
https://twitter.com/HPhobiaWatch/status/1780976622742774259

Exit mobile version