Coimbatore Police Searching For Lady Rowdy In Gokul Case: గ్యాంగ్ వార్స్.. ఇప్పటికీ అక్కడక్కడ ఇవి వెలుగు చూస్తుంటాయి. స్థానికంగా తమ బలం చాటుకోవడం కోసం, కొందరు రౌడీలు చిన్న చిన్న గ్యాంగ్‌లను మెయింటెయిన్ చేస్తుంటారు. ఏదో సమాజానికి మేలు చేస్తున్నంత లెవెల్‌లో.. వీళ్లు పరస్పరం గొడవ పడుతూనే ఉంటారు. ఒక్కోసారి ఈ గొడవలు ముదిరి.. హత్యలు చేసుకునేదాకా వెళ్తాయి. అలాంటి సంఘటనే ఒకటి కోయంబత్తూరులో చోటు చేసుకుంది. రెండు గ్యాంగ్‌ల మధ్య జరుగుతున్న గొడవలో.. ఓ యువకుడు అన్యాయంగా బలి అయ్యాడు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. ఈ హత్యకు ఓ లేడీ రౌడీతో లింక్ ఉండటం! ఇప్పుడు ఆ అమ్మాయి గురించే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
KGF3: కేజీఎఫ్3 నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పెద్ద స్కెచ్చే!
కోయంబత్తూరు రెండు రౌడీ గ్యాంగ్‌లు ఉన్నాయి. ఈ గ్యాంగ్‌ల మధ్య గత నెల రోజుల నుంచి తీవ్రస్థాయిలో వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఓ రౌడీ గ్యాంగ్ ‘గోకుల్’ అనే యువకుడ్ని చంపింది. దీనిపై హత్య కేసు నమోదు చేసి, పోలీసులు విచారణ చేపట్టగా.. లేడీ రౌడీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గోకుల్‌ని చంపిన గ్యాంగ్‌తో ఆ లేడీ రౌడీ కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రీల్స్ చేసింది. అంతేకాదండో.. ఆ యువతి సిగరెట్ తాగుతూ, కత్తులతో బెదిరిస్తున్న రీల్స్ కూడా చేసింది. ఈ రీల్స్ గమనించిన పోలీసులు.. కచ్ఛితంగా ఈ హత్య వెనుక ఆ యువతి హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ లేడీ రౌడీ ‘ఫ్రెండ్స్ కాల్ మీ తమన్నా’ అనే పేరుతో అకౌంట్ తెరిచింది. ఈ హత్య జరిగినప్పటి నుంచి ఆ లేడీ రౌడీ కూడా కనిపించకుండా పోయింది. దీంతో.. ఆ యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అటు, ఆ గ్యాంగ్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో, ఈ కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం తమిళనాడులో ఈ లేడీ రౌడీ గురించే చర్చలు జరుగుతున్నాయి.
No Tax On Gold: భారతీయులకు గుడ్ న్యూస్.. బంగారంపై పన్ను లేదు..!
ఇదే సమయంలో పోలీసులు మరో నిర్ణయం తీసుకున్నారు. కామరాజపురం గౌతమ్, తేళ్లవారి గ్రూప్, ప్రగా బ్రదర్స్ అనే మూడు రౌడీ గ్రూపుల సోషల్ మీడియా ఖాతాలను పూర్తిగా తొలగించారు. ఆ ఖాతాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా తాము ‘మెటా’ సంస్థకు లేఖ కూడా రాసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ గ్రూపులు కత్తులు, కొడవళ్లు తదితర మారణాయుధాలతో పోస్టులు పెడుతూ.. ఇతర గ్రూపులపై విద్వేషం పెంచుతున్నాయని అధికారులు వెల్లడించారు. ద్వేషాన్ని పెంపొందించే మరికొన్ని సోషల్ మీడియా ఖాతాలను సైతం తాము ట్రాక్ చేస్తున్నామన్నారు. విద్వేషపూరితమైన కంటెంట్‌ని పోస్ట్ చేయొద్దని, లేకుంటే చర్యలు తీసుకుంటామని ప్రజల్ని హెచ్చరించారు.