న్యాయాన్నే నమ్ముతూ.. చట్టాన్నే ఆయుధంగా చేసుకుంది ఆ యువతి! తనకెలాంటి అన్యాయం జరగదని భావించింది..!! ఎందుకంటే.. ఎదుట ఉన్నది తన రక్తసంబంధమే. సొంత అన్నే కదా.. ఏ ఆపదా రాదనుకుంది. కానీ.. అమ్మ ఒడిలో కలిసి పెరిగిన అన్నయ్యే.. యముడిలా మారాడు. భూమి కోసం సొంత చెల్లిని కిరాతకంగా హతమార్చాడు. భూమి కోసం మానవసంబంధాలనే పూడ్చిపెట్టిన కిరాతక ఘటన మనసును కదిలిస్తోంది.
అమ్మ లో అ… నాన్న లో న్న.. రెండూ కలిస్తే అన్న!! అమ్మా నాన్నల కంటే ఆప్యాయంగా చూసుకుంటూ అక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత అన్నపై ఉంటుంది. చెల్లి కంట్లో కన్నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అన్నపై ఉంటుంది. కానీ.. ఇక్కడో అన్న.. కిరాతకంగా మారాడు. ఆస్తి కోసం సొంత చెల్లినే పొట్టన పెట్టుకున్నాడు. కారుతో గుద్ది… కిరాయి రౌడీలతో కలిసి… కత్తులతో దాడిచేసి హతమార్చాడు. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో అడ్వకేట్ స్వప్న హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి…
రంగారెడ్డి జిల్లా కేతిరెడ్డిపల్లికి చెందిన స్వప్న.. చేవెళ్ల కోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. స్వప్న తండ్రి… తనకున్న 10 ఎకరాల భూమిలో 6 ఎకరాలను కొడుకు రాజు పేరు మీద, మిగతా 4 ఎకరాలను కూతురు స్వప్న మీద రాసి ఇచ్చాడు. ఇంటికి వారసుడినని… ఒక్కగానొక్క కొడుకునైన తనకే 10 ఎకరాలు చెందాలి కానీ… రేపు ఎవడినో పెళ్లి చేసుకుని వెళ్లిపోయే చెల్లికి భూమి ఎందుకు..? అంటూ.. రాజు విషం గక్కాడు. తండ్రితో గొడవ పెట్టుకున్నాడు. చెల్లి స్వప్నతో తగాదాకు దిగాడు. 4 ఎకరాలు తిరిగి తన పేరు మీదే రాయాలని పట్టుబట్టాడు. ఇందుకు కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. మనసులో మరింత కక్ష పెంచుకున్నాడు రాజు…
పొలం సర్వే జరుపుతుండగా… స్వప్న కూడా అక్కడికి చేరుకుంది. అన్న రాజు.. స్వప్నతో అక్కడ కూడా గొడవ పెట్టుకున్నాడు. అప్పటికే చెల్లిని హతమార్చేందుకు కిరాయి రౌడీలను కూడా సిద్ధం చేసుకున్నాడు రాజు. పొలంలో ఉన్న స్వప్నను రాజు.. ఒక్కసారిగా కారుతో వేగంగా వచ్చి ఢీ కొట్టాడు. కిందపడిపోయిన స్వప్నపై రాజు, తన రౌడీ మూకలు ఎర్రోళ్ల సందీప్, వడ్డె వీరేశం, కావలి శివలింగం రాళ్లు, కత్తులతో దాడి చేశారు. అప్పటికే రక్తపు మడుగులో ఉన్న స్వప్నపై మరింత కసిగా దాడి చేశాడు రాజు. కొబ్బరి బోండాలు నరికే కత్తితో గొంతు కోశాడు…
వాయిస్: దాడి చేసిన దుండగులు.. అక్కడే ఉన్న ఇన్నోవా కారు, స్కూటీలో పారిపోయారు. నిందితుల కోసం ప్రత్యేక టీమ్‌లతో గాలించిన పోలీసులు.. దుండగులను పట్టుకున్నారు. అడ్వకేట్ స్వప్న హత్యకు భూ తగాదాలే కారణమని తేల్చారు పోలీసులు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు… కక్షతో చెల్లిని చంపితే హంతకుడవుతాడు.. కానీ ఆస్తి తిరిగి ఎలా వస్తుంది? ఇంత చిన్న లాజిక్ రాజు మిస్సయాడంటున్నారు పోలీసులు..
