Accident : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తండ్రీకూతుళ్ల ప్రాణాలను బలి తీసుకుంది. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా లారీ వారిని ఢీకొట్టి ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులు రవీందర్ (32), ఆయన కుమార్తె కృప (12)గా గుర్తించారు. కృప చేవెళ్లలోని గురుకుల పాఠశాలలో చదువుతోంది. పాఠశాల ముగిసిన తరువాత రవీందర్ తన కుమార్తెను ద్విచక్రవాహనంపై ఇంటికి తీసుకువెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఢీకొన్న బలానికి బైక్‌పై నుంచి కిందపడిన తండ్రీకూతుళ్లపై లారీ దూసుకుపోయింది. టైర్ల కింద నలిగిన వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక సంఘటనతో కుటుంబంలోనే కాదు, గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్టన్నింగ్ లుక్స్, అప్డేటెడ్ ఫీచర్స్తో Renault Kiger Facelift లాంచ్.. ధర ఎంతంటే?
