Site icon NTV Telugu

Fraud: రూ.22,842 కోట్ల మోసం.. నివ్వెరపోయిన సీబీఐ..!

సీబీఐ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు మోసాన్ని చూసింది నోరు వెల్లబెడతున్నారు అధికారులు.. ఇప్పటికే వందల, వేల కోట్లు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి.. విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్తలు ఎందరో ఉండగా… దేశంలో మరో భారీ మోసం బయటపడిందది. నౌకల తయారీ రంగానికి చెందిన ఏబీజీ షిప్‌యార్డ్‌ దేశంలోని పలు బ్యాంకులను రూ.22,842 కోట్లకు మోసం చేసినట్టు బయటపడింది.. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. సంబంధిత కంపెనీ డైరెక్టర్లపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.. ఏబీజీ షిప్‌యార్డ్‌.. మొత్తం 28 బ్యాంకులను మోసం చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.. ఆ లిస్టులో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐతో పాటు ఐసీఐసీఐ, ఐడీబీఐ వంటి బ్యాంకులు కూడా ఉన్నాయి. ఈ స్కామ్‌పై ఇప్పటికే ఎస్బీఐ ఫిర్యాదు చేసింది. ఏబీజీ సంస్థ.. ఎస్బీఐకి రూ.2,925కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.7,089కోట్లు, ఐడీబీఐ బ్యాంక్‌కు రూ.3,634కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు రూ.1,614కోట్లు, పీఎన్‌బీ బ్యాంక్‌కు రూ.1,244కోట్లు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌కు రూ.1,228కోట్లు రుణాలు చెల్లించాల్సి ఉందని.. తన ఫిర్యాదులో పేర్కొంది ఎస్బీఐ.

Read Also: Pawan Kalyan: మత్స్యకారులకు అండగా జనసేన.. 20న బహిరంగసభ

ఇక, రంగంలోకి దిగిన సీబీఐ.. ఈ కేసులో ఏబీజీ షిప్‌ యార్డ్ డైరెక్టర్లు రిషి అగర్వాల్‌, శంతనం ముత్తుస్వామి, అశ్విని కుమార్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకుల నుంచి కంపెనీ యాజమాన్యం రుణాలు తీసుకుని నిధులను మళ్లించడం, నిధుల దుర్వినియోగం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను పాల్పడ్డారని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనట్లు తెలుస్తోంది.. ఈ కంపెనీలకు, నిందితులకు చెందిన సూరత్, భరూచా, ముంబై, పుణే తదితర పట్టణాల్లో 13 ప్రాంతాల్లో సోదాలు చేశాం. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని సీబీఐ చెబుతోంది.. 2012–17 వరకు కంపెనీ కార్యకలాపాలపై ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సంస్థ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించింది. నిందితులంతా కుమ్మక్కై నిధులను దారి మళ్లించి దుర్వినియోగం చేసినట్లు గుర్తించింది. ఏబీజీ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ లోన్‌ అకౌంట్‌ను 2016 జూలైలో నిరర్థక ఆస్తిగా (ఎన్‌పీఏ) బ్యాంకుల కన్సార్టియం ప్రకటించింది.

Exit mobile version