Site icon NTV Telugu

Tamilnadu: ఆటోను వేగంగా ఢీకొన్న కారు.. సురక్షితంగా బయటపడిన మహిళ.. వీడియో వైరల్

Accident

Accident

Tamilnadu: తమిళనాడులోని కొట్టాయం మీనాచిల్ వద్ద ఆగి ఉన్న ఆటోను కారు వేగంగా ఢీకొంది. అదృష్టవశాత్తు వేగంగా వెళ్తున్న రెండు వాహనాల మధ్య నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ సురక్షితంగా బయటపడింది. అసలేం జరిగిందంటే.. కొట్టాయం మీనాచిల్ వద్ద రోడ్డు పక్కన మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె ఎదురుగా ఓ ఆటో ఆగి ఉంది. ప్రమాదవశాత్తు వేగంగా వచ్చిన కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఆ వేగానికి ఆటో మహిళ పైనుంచి పల్టీ కొట్టింది. కారు ఆమె పక్క నుంచి వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ రెండు వాహనాల్లో ఆమెకు ఏది తగలకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version