Site icon NTV Telugu

Accident : మేడారంకు బయలుదేరి.. తిరిగిరాని లోకాలకు..

రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమక్క-సారక్క జాతర గురించి ప్రత్యేకంగా చెప్పనెక్కర్లేదు. సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. అయితే ఇలా మేడారం జాతరకు బయలుదేరిన ఓ కుటుంబ ప్రయాణం విషాదాంతంగా ముగిసింది. ఎంతో ఆనందంగా అమ్మవార్ల దర్శనం కోసం ఇంటి నుంచి మేడారంకు కారులో ఓ కుటుంబం బయలు దేరింది. అయితే ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం వద్దకు రాగానే ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదానికి గురైన కారులో ప్రయణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version