సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నేనవత్ లక్పతి పై తీవ్రంగా దాడి చేశారు సింగరేణి కాలనీ వాసులు. తీవ్రంగా గాయపడిన నేనవత్ లక్సతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు నల్గొండ జిల్లా దేవరకొండ చిత్రీయల్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు పోలీసులు. వెంకటేశ్వర వైన్స్ వద్ద లక్పతిని కొడుతున్నారు అంటూ భార్య విజయకు ఫోన్ వచ్చింది. వెళ్లి చూసేసరికి రక్తపు మడుగులో లక్పతి వున్నాడు. దీంతో సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో భార్య విజయ ఫిర్యాదు చేసింది.
లక్పతి హత్యపై పోలీసులు కూపీ లాగుతున్నారు. మకట్ లాల్, గణపతి, గణేష్, వెంకటేష్, సైదులుపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది భార్య విజయ. సైదాబాద్ లో చిన్నారి చైత్ర ఘటన తర్వాత మద్యం, పాన్ మసాలా జర్ధా నిర్మూలనపై పోరాటం చేస్తున్నాడు లక్పతి. సింగరేణి కాలనిలో మద్యం, జర్ధా, పాన్ మసాలా అమ్మకూడదని, అమ్మకాలతో మన కుటుంబాలు రోడున్న పడుతున్నాయి అంటూ పలు చోట్ల స్టేట్ మెంట్స్ ఇచ్చాడు లక్పతి. దీనిని మనసులో పెట్టుకొని లక్పతి ని హత్య చేశారు అంటూ భార్య ఆరోపిస్తోంది. లక్పతి హత్యతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. నిందితులపై 324 R/W 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Read Also: Brutal Murder in Singareny colony: సైదాబాద్ సింగరేణి కాలనీలో వ్యక్తి దారుణ హత్య
