Site icon NTV Telugu

Nizamabad : నిజామాబాద్‌ జిల్లాలో కలకలం రేపుతున్న ఉగ్ర కదలికలు

Arrest

Arrest

Nizamabad : ఉగ్రవాద సంబంధాలున్నాయనే ఆరోపణలతో బోధన్‌కు చెందిన యువకుడు ఉజైఫా యామన్ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అతన్ని ఢిల్లీకి తరలించారు. ఈ అరెస్టుతో బోధన్ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో బాంబు దాడులకు కుట్రలు చేస్తున్న డ్యానిష్ అనే ఉగ్రవాది ఇచ్చిన సమాచారం ఆధారంగా యామన్‌ను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులకు సంబంధించిన యాప్‌లో యామన్ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తయారీలో పాలుపంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

యామన్ నివాసంలో జరిపిన సోదాల్లో పోలీసులు ఒక ఎయిర్ పిస్టల్ మరియు కొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో బోధన్‌లో ఉగ్రవాద మూలాల కదలికలు ఉన్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం యామన్ ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నాడు, కేసులో పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. ఈ అరెస్ట్ స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన ఉజైఫా యామన్ కు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని అతని కుటుంబ సభ్యులు గట్టిగా ఖండించారు. కేవలం అనుమానం ఆధారంగానే తమ కుమారుడిని అరెస్ట్ చేశారని, దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Sreeleela : ఫ్యాన్ బాధను తీరుస్తూ ..హృదయాన్ని హత్తుకున్న శ్రీలీల రిప్లై

యామన్ కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం, యామన్ కేవలం ఆన్‌లైన్‌లో డానిష్ అనే వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడాడు. ఈ కాల్ ఆధారంగానే ఢిల్లీ పోలీసులు యామన్ కు ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమ ఇంటికి వచ్చినప్పుడు దర్యాప్తుకు పూర్తిగా సహకరించామని, కానీ వారి సోదాల్లో ఎలాంటి ఉగ్రవాద సంబంధిత ఆధారాలు లభించలేదని కుటుంబం స్పష్టం చేసింది.

యామన్ ఒక అమాయకుడని, అతనికి ఉగ్రవాద కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని అతని కుటుంబ సభ్యులు పదే పదే నొక్కి చెప్పారు. తమ కుమారుడిని వెంటనే విడిచిపెట్టాల్సిందిగా వారు ఢిల్లీ పోలీసులను వేడుకుంటున్నారు. ఈ ఘటన బోధన్ లో చర్చనీయాంశంగా మారింది, స్థానికులు కూడా యామన్ అమాయకత్వాన్ని నమ్ముతున్నారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల వాదనను పోలీసులు పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి పరిణామాల కోసం యామన్ కుటుంబంతో పాటు స్థానికులు ఎదురుచూస్తున్నారు.

Sathya sai district: దారుణం.. భార్యను చంపిన జులాయి భర్త.. కారణమేంటో తెలిస్తే..!

Exit mobile version