Bhuvanagiri Police Arrested Brothers In Fake Real Estate Business Case: అడ్డదారిలో డబ్బులు దోచుకునేందుకు దొంగలు పన్నే పన్నాగాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా.. ట్రెండ్‌కి తగ్గట్టే పావులు కదుపుతుంటారు. ఆయా పరిస్థితుల్లో దేనికైనా మార్కెట్‌లో డిమాండ్ ఉంటుందో, దాన్నే అస్త్రంగా మార్చుకొని ప్రజలకు టోకరా వేస్తుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్దరు బ్రదర్స్ అలాంటి మోసానికే పాల్పడ్డారు. అక్కడ రియల్ ఎస్టేట్‌కు మంచి గిరాకీ ఉందన్న విషయం తెలుసుకొని, ఆ బిజినెస్‌నే అడ్డం పెట్టుకొని కోట్లకు పడగలెత్తారు. తీరా వీరి బండారం బయటపడటంతో, పోలీసులు రంగంలోకి దిగి బడిత పూజ చేశారు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లాలో రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ బాగా ఉండడంతో.. సయ్యద్ సైఫ్, సయ్యద్ సమీర్ అనే సోదరులు ఫేక్ బిజినెస్ ప్రారంభించారు. తక్కువ రేట్లకు స్థలాలు అందిస్తామని చెప్పి.. ప్రజల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నారు. తీరా తాము మోసపోయామన్న సంగతి తెలుసుకున్న ప్రజలు.. ఆ ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 24 మంది ఫిర్యాదు చేయడంతో, ఈ కేసుని పోలీసులు సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆ బ్రదర్స్‌ని అదుపులోకి తీసుకొని, రిమాండ్‌కి తరలించాం. ఆ సోదరులిద్దరు ప్రజల నుంచి ఐదు నుంచి ఆరు కోట్ల దాకా వసూలు చేసినట్లు విచారణలో తేలిందని భువనగిరి ఏసీపీ వెంకట్ రెడ్డి వెల్లడించారు.
ఆ బ్రదర్స్ వద్ద నుంచి తాము రూ. 80 లక్షల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నామని వెంకట్ రెడ్డి తెలిపారు. రెండు భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, 29 తులాల బంగారం, రెండు మారుతి కార్లు, నాలుగు ద్విచక్ర వాహనలు, ఒక కేటీఎమ్ బైక్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, ఓ కంప్యూటర్‌ని స్వాధీనం చేసుకొని.. వాటిని సీజన్ చేసినట్లు ఏపీసీ చెప్పారు. ఫేక్ బిజినెస్ మాయాజాలంలో పడొద్దని, ఇలాంటి దోపిడీదారులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒకటికి రెండుసార్లు కన్ఫమ్ చేసుకున్నాక ముందడుగు వేయాల్సిందిగా సలహా ఇచ్చారు.
