AP Crime: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. తల్లిని, తమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు దాడి చేశాడు గునుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి.. ఈ ఘటనలో తల్లి గునుపూడి మహాలక్ష్మి, రవితేజ అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిని తమ్ముడిని హత్య చేసిన అనంతరం నిందితుడు 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడం. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వివరాలు సేకరించారు.. అయితే, ఈ ఘటనకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది.. రెండు హత్యల అనంతరం నిందితుడు మాట్లాడిన వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.. తల్లిని, తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన గునుపూడి శ్రీనివాస్ పోలీసులతో మాట్లాడిన వీడియో అది.. తల్లి గునుపూడి మహాలక్ష్మి , తమ్ముడు గునుపూడి రవితేజలను తానే హత్య చేశానని, చనిపోయిన తర్వాత కూడా దెయ్యాలుగా మారి నన్ను వేధిస్తారంటూ చెప్పుకొచ్చాడు నిందితుడు శ్రీనివాస్..
Read Also: CM Chandrababu: నేడు 50 ఎంఎస్‌ఎంఈ పార్కులకు శ్రీకారం..
ఎవరు ఏం మాట్లాడుకున్నా ముందే మా అమ్మకు, తమ్ముడికి తెలిసిపోతుంది.. వాళ్లిద్దరూ మనుషులు కాదు.. దెయ్యాలు.. అందుకే వాళ్లని హత్య చేశా అంటూ పోలీసులకు చెప్పుకొచ్చాడు నిందితుడు శ్రీనివాస్.. వాళ్లు దెయ్యాలు.. 18 సంవత్సరాల నుంచి నన్ను పిక్కు తింటున్నారు.. అందుకే చంపేశా.. అంతేకాదు. చంపేసిన బతుకుతారేమో అని భయంగా ఉంది.. అంటూ వీడియోలో నిందితుడు గునుపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు అతడి మానసిక పరిస్థితికి అద్దం పట్టినట్టుగా ఉన్నాయి.. కాగా, భీమవరం సుంకర పద్దయ్య వీధిలో వీధిలో నివాసముంటున్న గునుపూడి శ్రీనివాస్ సోమవారం రోజు తెల్లవారుజామున తల్లి మహాలక్ష్మి, తమ్ముడు రవితేజను కత్తితో నరికి హత్య చేశాడు. అంతేకాకుండా తల్లిని, తమ్ముడిని కత్తితో హత్య చేసానని ఇప్పుడు తాను వచ్చి లొంగిపోవాలని నేరుగా 112 కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు నిందితుడు శ్రీనివాస్. ఈ సమాచారంతో అలెర్ట్ అయిన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
