కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘట చోటుచేసుకుంది. చీరలు చోరీ చేసిందనే ఆరోపణలతో .. రోడ్డు మీద 55 ఏళ్ల మహిళపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే..రలు దొంగిలించిందని తెలుగు మహిళను రోడ్డుపైకి ఈడ్చుకెళ్ళి దారుణంగా కొట్టాడు దుకాణదారుడు. బెంగళూరులోని అవెన్యూ రోడ్డులో మియా సిల్క్ సారీ దుకాణం ఉంది. పండుగ దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఆ దుకాణంలో… హడావిడి వాతావరణం నెలకొంది. దాదాపు 91 వేల 500 రూపాయల విలువైన చీరల కట్టను తెలుగు మహిళా దొంగిలించినట్లు ఆరోపించాడు ఓనర్. దొంగిలించిన మరుసటి రోజు ఆ మహిళ అటువైపు వెళుతుండగా ఆ దుకాణపు సిబ్బంది చూశారు. వెంటనే అవెన్యూ రోడ్‌లోని మాయా సిల్క్ చీరల యజమాని ఉమేద్ రామ్, అతడి సిబ్బంది కలిసి ఆమెపై దాడి చేసి.. దారుణంగా కొట్టారు..
అయితే.. ఈ సంఘటన వైరల్ కావడంతో రంగంలోకి పోలీసులు దుకాణదారుడిపై కేసు నమోదు చేసి, అతనిని, అతడి సిబ్బందిని అరెస్ట్ చేసారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతన్నారు.
