NTV Telugu Site icon

Bengaluru: మరో శ్రద్ధావాకర్ తరహా ఘటన.. ప్రెషర్ కుక్కర్‌తో హత్య..

Bengaluru Crime

Bengaluru Crime

Man Kills Live-In Partner With Pressure Cooker: ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ ఉదంతం దేశాన్ని కలవరానికి గురి చేసింది. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న శ్రద్ధాని, అఫ్తాబ్ పూనావాలా అత్యంత క్రూరంగా చంపాడు. ఈ ఘటన తరువాత ఇలాగే పలు ప్రాంతాల్లో సహజీవనంలో ఉన్న మహిళల్ని వారి ప్రియులు చంపేశారు.

ఇదిలా ఉంటే తాజాగా బెంగళూర్ లో కూడా ఇలాగే లివ్ రిలేషన్ లో ఉన్న ఒక మహిళను చంపేశాడు. అనుమానంతో ప్రెషర్ కుక్కర్ తో కొట్టి చంపేసిన ఘటన నగరంలోని బేగూర్ లోని మైకో లేఅవుట్ లో శనివారం సాయంత్రం 5 గంటలకు చోటు చేసుకుంది. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Rozgar Mela: ప్రధాని మోదీ చేతుల మీదుగా 51,000 అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ తిరువనంతపురానికి చెందిన 24 ఏళ్ల దేవా అనే యువతి, కేరళలోని కొల్లాంకు చెందిన 20 ఏళ్ల వైష్ణవ్ అనే యువకుడితో గత రెండేళ్లుగా సహజీవవం చేస్తుంది. ఇద్దరు బెంగళూర్ లోని ఓ అపార్ట్మెంట్ లో రెండేళ్లుగా నివసిస్తున్నారు. వీరిద్దరూ కలిసి కాలేజీలో చదువుకుని సేల్స్, మార్కెటింగ్ రంగంలో పనిచేస్తున్నారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని ఇరుగుపొరుగు పోలీసులకు తెలిపారు.

అయితే గొడవలు జరుగుతున్నప్పటికీ వీరిద్దరు ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేసుకోలేదని పోలీసులు తెలిపారు. యువతిపై అనుమానం పెంచుకున్న వైష్ణవ్, ఆదివారం యువతితో గొడవ పడ్డాడు. దేవను వైష్ణవ్ ప్రెషర్ కుక్కర్ తో కొట్టి చంపినట్లు దక్షిణ బెంగళూరు సీనియర్ పోలీసు అధికారి సికె బాబా తెలిపారు. ఈ ఘటన తర్వాత దేవ సోదరి ఫోన్ చేయగా ఎంతకు సమాధానం రాకపోవడంతో, చుట్టుపక్కల వారిని సంప్రదించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

హత్య అనంతరం నిందితుడు వైష్ణవ్ పారిపోయాడు. పోలీసులు అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. హత్య కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Show comments