Site icon NTV Telugu

AP Crime: కీచకపర్వం.. ప్రియుడి గొంతుపై కత్తి పెట్టి.. ప్రియురాలి గ్యాంగ్ రే*ప్‌..

Gang Rape

Gang Rape

AP Crime: చిత్తూరులో జిల్లాలో మాటలకందని అమానుషం చోటుచేసుకుంది. నగరంలోని అటవీ శాఖ పార్కులో పట్టపగలు ఒకరి తర్వాత ఒకరుగా సాగించిన కీచకపర్వానికి ఓ బాలిక జీవితం బలయ్యింది. ప్రియుడు గొంతుపై కత్తి పెట్టి.. బాలికను బెదిరించి అతని కళ్లెదుటే కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు.  ఆలస్యంగా వెలుగుచూసిన గ్యాంగ్‌ రేప్‌ ఘటన చిత్తూరు నగరంలో కలకలం రేపింది. నిందితులు రాజకీయ కార్యకర్తలు కావడం అధికార,విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదికైంది. పట్టపగలు.. మిట్ట మధ్యాహ్నం ఓ ప్రేమ జంటను ముగ్గురు యువకులు బెదిరించి బాలికపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి ఒడిగట్టారు. చిత్తూరు జిల్లాలో గత నెల 25న జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగు చూడగా.. పోలీసులు ఆలస్యంగా కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. చిత్తూరు నగరం మురకంబట్టుకు చెందిన బాలుడు (18), బాలిక (17) ప్రేమించుకుంటున్నారు. సరదాగా మాట్లాడుకోవడానికి మురకంబట్టులో ఇటీవల ఏర్పాటు చేసిన నగరవనానికి వెళ్లారు. అక్కడ చిత్తూరుకు చెందిన ముగ్గురు యువకులు హేమంత్‌, మహేష్‌, కిశోర్‌ ఆ ప్రేమజంటను చూసి టార్గెట్‌ చేశారు. వారి వద్దకు వెళ్లి అటవీశాఖ సిబ్బందిగా పరిచయం చేసుకున్నారు. అనంతరం వారిని ఫొటోలు, వీడియోలు తీసి వారి తల్లిదండ్రులకు పంపిస్తామని బెదిరించి అధికారులు పిలుస్తున్నారని బాలుడిని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. తర్వాత బాలికపై అత్యాచారానికి యత్నించగా కేకలు పెట్టింది. దీంతో ఓ యువకుడు బాలిక నోటిని గట్టిగా మూయగా, మిగిలిన వారు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్ప డ్డారు. అక్కడి నుంచి వెళ్లే సమయంలో బాలుడి మెడలోని బంగారు గొలుసు లాక్కుని పారిపోయారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో ఆ రోజు నుంచి బాలుడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నగరవనం వద్ద నింది తుల కోసం కాపు కాశారు. ఒంటరి జంటలను బెదిరించి అత్యాచారాలు చేసే ముగ్గురు యువకులు సోమవారం మళ్లీ నగరవనం వద్దకు వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనపై పూర్తి సమాచారం సేకరిచంకుండా బాధితురాలి బాయ్‌ఫ్రెండ్‌ ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు హత్యాయత్నం, రాబరీ, చంపుతామని బెదిరించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు…

అయితే నిన్మ వైసీపీ సోషల్‌ మీడియాలో గ్యాంగ్‌ రేప్‌ విషయం వైరల్‌ కావడంతో పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అనంతరం ఆమెను చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలోని వన్‌స్టా్‌ప సెంటర్‌కు తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఆ కేసుకు మరిన్ని సెక్షన్లు జోడించారు. పోక్సో, గ్యాంప్‌ రేప్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లను అప్పటికే నమోదైన కేసుకు జత చేశారు. నిందితులకు సంబంధించి వైసీపీ సోషల్‌మీడియాలో రాజకీయ రంగు పులమడం వివాదాస్పదమైంది.. ఘటనపై కఠినమైమ చర్యలు తీసుకుంటామని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. ఈ కేసుకు రాజకీయాల రంగులు పులమొద్దని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరారు‌.

నిందితులు రాజకీయ కార్యకర్తలు కావడం అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదికైంది. గ్యాంగ్‌ రేప్‌ విషయాన్ని మంగళవారం వైసీపీ పలు వాట్సాప్‌ గ్రూపుల్లో, సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసింది. నిందితులు కిశోర్‌, మహేష్‌ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌తో వున్న ఫొటోలను పోస్ట్‌ చేసింది. దీంతో టీడీపీ వాళ్లు కూడా విజయానందరెడ్డితో, పెద్దిరెడ్డితో నిందితులు కలిసి ఉన్న ఫొటోలను బయటపెట్టారు. అంతేకాకుండా ఎమ్మెల్యే జగన్మోహన్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ‘అత్యాచార ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి. వాళ్లు మా పార్టీ వాళ్లు కాదు. సభ్యత్వం కూడా లేదు. వైసీపీ వాళ్లే. వినాయక చవితి ఉత్సవాలకు ఆహ్వానించేందుకు లోకల్‌ టీడీపీ లీడర్లతో కలిసి నా వద్దకు వచ్చినప్పుడు ఫొటోలు తీసుకున్నారు’ అని వివరణ ఇచ్చారు. ఆ తర్వాత వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి విజయానందరెడ్డి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టారు. ‘గ్యాంగ్‌ రేప్‌ ఘటనను మొదట సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది మా వాళ్లే. ఆ తర్వాతే పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు గతంలో మా పార్టీలో వున్నవారే కానీ వాళ్ల వైఖరి నచ్చక పంపించేశాం’ అని చెప్పుకొచ్చారు.

Exit mobile version