Site icon NTV Telugu

దారుణం: పేలిన పెట్రోల్ ట్యాంక‌ర్‌… 50 మంది మృతి…

క‌రేబియ‌న్ దీవి హైతీలో ఘోర‌ప్ర‌మాదం సంభ‌వించింది.  కేప్ హైతియాన్‌లో పెట్రోల్ తీసుకెళ్తున్న ఓ ట్యాంకర్ పేలింది.  ఈ ఘ‌ట‌న‌లో సుమారు 50 మందికి పైగా మృతి చెందారు.  వంద‌లాది మందికి గాయాల‌య్యాయి.  దాదాపు 20 కి పైగా ఇళ్లు మంట‌ల్లో చిక్కుకున్న‌ట్టు స్థానిక డిప్యూటీ మేయ‌ర్ పాట్రిక్ పేర్కొన్నారు.  మృతుల సంఖ్య‌ను ఇప్పుడే అంచ‌నావేసి చెప్ప‌లేమ‌ని, ఇళ్ల‌ల్లో ఉండి మ‌ర‌ణించిన వారిని గుర్తించాల్సి ఉంద‌ని, డిప్యూటీ మేయ‌ర్ పేర్కొన్నారు.   ఇక ఈ ప్రమాదంపై హైతీ ప్ర‌ధాని హెన్రీ దిగ్భాంతిని వ్య‌క్తం చేశారు.  

Read: లైవ్‌: శ్యామ్ సింగ‌రాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

ప్ర‌మాదాల‌ను నివారించేందుకు ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ నివారించ‌లేక‌పోతున్నారు. హైతీలో ఇటీవ‌ల కాలంలో ఈ త‌ర‌హా ప్ర‌మాదాలు అధికంగా జ‌రుగుతున్నాయి.  హైతీ పెట్రోల్ ట్యాంక‌ర్ ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స‌హాక‌య బృందాలు చ‌ర్య‌లు మొద‌లుపెట్టాయి.  మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.  

Exit mobile version