Site icon NTV Telugu

కలిగిరి జంట హత్యల కేసులో మరో ట్విస్ట్

నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని అమ్మటివారి పాలెంలో జరిగిన జంట హత్యల కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. తల్లి షేక్ మీరా, కొడుకు షేక్ అలిఫ్ లని మండలంలోని పొలంపాడు గ్రామానికి చెందిన రబ్బానీ హత్య చేసినట్లుగా కావలి అడిషనల్ ఎస్పీ ప్రసాద్ వెల్లడించారు. ఒకే రోజు ముగ్గురి హత్యకు నిందితుడు రబ్బానీ ప్రణాళికల రూపొందించినట్లు కావలి అడిషనల్ ఎస్పీ ప్రసాద్ తెలిపారు. కలిగిరిలో షేక్ మీరా, ఆమె కుమారుడు షేక్ అలిఫ్ ను హతమార్చిన రబ్బానీ.. అక్కడ నుంచి నేరుగా ఒంగోలుకు వెళ్లినట్లు.. ఒంగోలు రవి ప్రియ మాల్ వద్ద కాశీరావు అనే వ్యక్తి పై రబ్బానీ కత్తి తో దాడి చేసినట్లు దర్యాప్తు వెల్లడైందని పోలీసులు తెలిపారు.

రబ్బానీ కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలై కాశీరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రబ్బానీ పోలీసుల అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. రబ్బానీ భార్య నూర్జహాన్ తో కాశీరావు కు అక్రమ సంబంధం ఉందని, వివాహితైన నూర్జహాన్ ను రబ్బానీ 8 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య వివాదం నేపథ్యంలో నూర్జహాన్ బంధువులైన మీరా..ఆమె కుమారుడిని రబ్బానీ హతమార్చినట్లు గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Exit mobile version