ఏపీలో దారుణ ఘటన వెలుగు చూసింది.. విజయనగరం లో ఓ స్కూల్ టీచర్ ను అతి దారుణంగా చంపిన ఘటన వెలుగు చూసింది.. విజయనగరం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పథకం ప్రకారం దారుణంగా హత్య చేశారు. వాహనంతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశారు. వివరాల్లోకి వెళితే..
ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. రాజాం సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రాజాంలో నివాసముంటున్న ఏగిరెడ్డి కృష్ణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం తన ఇంటి నుంచి బైక్‌పై తెర్లాం మండలం కాలంరాజుపేటలోని పాఠశాలకు విధుల నిమిత్తం వెళ్తున్నారు. ఒమ్మి దగ్గరకు రాగానే కొందరు వ్యక్తులు బొలెరోలో వాహనం కృష్ణను వెంబడించి అతన్ని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది..ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన కృష్ణ అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం జరిగిన తీరును బట్టి ఇది పక్కా హత్య చేశారని 6, గ్రామస్థులు ఘటనాస్థలం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు.
ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రాజాంలో ఏగిరెడ్డి కృష్ణ నివసిస్తున్నారు. ఆయన తెర్లాం మండలంలోని కాలంరాజుపేటలోని గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నారు. అయితే ఎప్పటిలాగే శనివారం కూడా స్కూల్ కు వెళ్లేందుకు ఆయన బైక్ బయలుదేరాడు. అది గమనించిన వాళ్ళు కొద్ది పక్కా ప్లాన్ ప్రకారమే చంపినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు..2021 ఎన్నికల్లో ఆయన మద్దుతో సర్పంచిగా నెగ్గిన సునీత ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత వారిద్దరూ వైసీపీలో చేరారు. అప్పటికే ఆ పార్టీలో ఉన్న వెంకటనాయుడు దీన్ని జీర్ణించుకోలే పథకం ప్రకారం కృష్ణను హత్యచేసినట్లు ఆయన భార్య జోగేశ్వరమ్మ, కుమారుడు శ్రావణ్‌కుమార్, కుమార్తె ఝాన్సీతో పాటు బంధువులు ఆరోపిస్తున్నారు… ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
