NTV Telugu Site icon

Fraud: అమ్మాయిలు, ఆంటీలను మోసం చేసి కోట్లలో సంపాదన..

Fraud

Fraud

అతని టార్గెట్ ఒకటే.. అమ్మాయిలు, ఆంటీలను మోసం చేయడం. పెళ్లిలో కోసం వెబ్సైట్లో వెతుకుతున్న అమ్మాయిలను రెండో పెళ్లి కోసం వెతుకుతున్న ఆంటీలనే మోసం చేసి కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇప్పటివరకు ఒక వెయ్యి మందిని మోసం చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరి దగ్గరనైనా కనీసం 10 లక్షల రూపాయలను కొట్టేస్తాడు.. తాను అమెరికాలో ఉంటానని, అమెరికాలో స్థిరపడ్డానని.. తన తల్లి అమెరికాలో డాక్టర్ అని.. ఇండియాలో వచ్చి బిజినెస్ చేసి వెళ్ళిపోతున్నానని.. అందమైన అమ్మాయి కావాలని.. తనకు కోట్ల కొలది ఆస్తి ఉందని పలు విధాలుగా అమ్మాయిలను ఆంటీలను నమ్మిస్తాడు. ఏకంగా యానాం చెందిన ఒక ఎమ్మెల్యే ఫోటోనే డీపీగా పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్నాడు. అమ్మాయిలు, ఆంటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకుని ఆమెకు నగ్న వీడియోలు, ఫోటోలు తెప్పించుకుంటాడు. వాటిని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తాడు.. డబ్బులు వసూలు చేస్తాడు. కొన్ని సందర్భాల్లో తాను అమెరికాలో ఉన్నానని.. అందమైన గిఫ్ట్ తీసుకొస్తుంటే కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, తన బ్యాంక్ అకౌంట్ లో కార్డ్స్ అన్ని ఫ్రీజ్ చేశారని చెప్పి.. అమ్మాయిలు ఆంటీల అకౌంట్లో నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. డాక్టర్, ప్రజా ప్రతినిధి, ఎవరైనా ఒకటే అందర్నీ మోసం చేయడమే ఈ వంశీ లక్షణం. నాలుగు రాష్ట్రాల అమ్మాయిలను ఆంటీలను మోసం చేసిన వంశీని పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

Read Also: Off The Record: టీడీపీలో చిన్న పోస్ట్‌ను అడ్డం పెట్టుకుని ఆ నాయకురాలు అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారా..?

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరి బీటెక్ చేయడానికి 2014లో హైదరాబాద్ కు వచ్చాడు. బీటెక్ మధ్యలోనే ఆపేసి 2015లో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్లకు అలవాటుపడ్డాడు. అంతేకాకుండా జాబ్ కన్సల్టెన్సీ అంటూ కొంతమందిని మోసం చేసిన కేసులో అరెస్ట్ అయి బయటకు వచ్చాడు. అయిన బుద్ది ఏ మాత్రం మారలేదు. ఆ తరువాత సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తన ఆదాయంలో ఎక్కువగా సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నట్లుగా నమ్మించి, దాదాపు 1000 మంది నుంచి డబ్బు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా యానాంలోని ఓ ఎమ్మెల్యే ఫొటోను సోషల్ మీడియాలో డీపీగా పెట్టుకుని ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానంటూ 50 మంది నుంచి కోట్లు కాజేశాడు.

ఇన్ని కేసులు, అన్ని సార్లు జైలు శిక్ష అనుభవించిన మనోడికి ఎక్కడా కూడా బుద్ది రాలేదు. మనసు మారలేదు. ఈ సారి మోసాలకు పెళ్లి సంబంధాలను ఎంచుకున్నాడు. మ్యాట్రీమోనీ తరహా వెబ్ సైట్ లలో తప్పుడు సమాచారం పెట్టి.. తాను ఓ ఎన్నారై అని తనది ఐటీ ఉద్యోగమని అమ్మ అమెరికాలో పెద్ద డాక్టర్ అంటూ రెండో పెళ్లి కోసం చూస్తున్న వారు, 30 ఏళ్ల వయసు దాటిన వారినే టార్గెట్ గా వల విసిరేవాడు. వాట్సప్ కాల్ ద్వారా చాటింగ్, కాల్స్ ద్వారా మంతనాలు జరిపేవాడు. తనమీద అమ్మాయిలకు నమ్మకం కుదిరాక తన బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని.. ఐటీ అధికారులు డబ్బు తీసుకెళ్లారని, కుటుంబ సభ్యులు ఆసుపత్రుల్లో ఉన్నారంటూ కథలు అల్లేవాడు. కొన్నిరోజులకు బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తే వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. అందులో భాగంగానే ఇటీవల జూబ్లీహిల్స్కు చెందిన ఒక డాక్టర్ వద్ద కూడా ఇలానే 11 లక్షలు కాజేశాడు. దీంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని బెంగుళూరులో అరెస్ట్ చేశారు.

రెండో పెళ్లి కోసం ప్రయత్నించేవాళ్లు, 30 ఏళ్లు వయసుదాటిన మహిళలను టార్గెట్ చేస్తూ.. వాట్సప్‌ కాల్‌ ద్వారా వారితో సంప్రదింపులు జరిపేవాడు. మాయమాటలతో వారిని బోల్తా కొట్టించేవాడు.. అమెరికాలో మా అమ్మ పెద్ద డాక్టర్ అని.. తాను ఇండియాలో ఉంటూ వ్యాపారం చేస్తుంటానని చెప్పేవాడు. తన తల్లి అమెరికా నుంచి రాగానే పెళ్లి చేసుకుందామని నమ్మబలికేవాడు. వారికి నమ్మకం ఏర్పడిన తర్వాత తన ప్లాన్ అమలు చేసేవాడు. బ్యాంకు అకౌంట్‌లు ఫ్రీజ్‌ చేశారని, ఐటీ అధికారులు రైడ్ చేసి డబ్బులు తీసుకెళ్లారని, కుటుంబ సభ్యులు హాస్పిటల్స్‌లో ఉన్నారని, వ్యాపారంలో నష్టం వచ్చిందని ఇలా ఒక్కొక్కరికి ఒక్కో కారణం చెప్పి 5-25 లక్షల వరకూ వారి నుంచి కొట్టేశాడు. తమ డబ్బులు ఇచ్చేయమని ఎవరైనా డిమాండ్‌ చేస్తే బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు.

ఫొటోలు మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేస్తానంటూ బెదిరించేవాడు. బాధితుల నుంచి కొట్టేసిన సొమ్ముతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, జల్సాలు చేస్తుండేవాడు. ఇటీవల జూబ్లీహిల్స్‌కు చెందిన ఒక డాక్టర్ దగ్గర ఇలాగే 11 లక్షలు లాగేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. మార్చి 13న బెంగళూరులో అరెస్ట్‌ చేశారు.. వంశీ కోసం నాలుగు రాష్ట్రాల పోలీసులు గాడిస్తున్నారు గతంలో కూడా పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు జైలుకు వెళ్లి వచ్చిన ప్రతిసారి కూడా తాను ఇలాంటి మోసాలు చేస్తూనే ఉన్నారు అయితే ఈసారి పిడి ఆక్ట్ నమోదు చేసి శాశ్వతంగా జైలుకు పంపాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.