Extramarital affairs: అలా వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. చివరికిలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాహేతర బంధాలు దాడులు, హత్యలకు దారి తీస్తున్నాయి. అనంతపురం జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంతకీ ఈ రెండు కేసుల్లో అసలేం జరిగింది?
వివాహేతర బంధాలు… కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. హత్యలు జరగడం సర్వసాధారణమైపోయింది. ఆ బంధాల కారణంగా.. హత్యలు కూడా జరగడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి రెండు ఘటనలు అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించాయి. జిల్లాలో జిల్లాలో వివాహేతర సంబంధం ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన గుంతకల్ మండలం తిమ్మాపురంలో సంచలనం రేపింది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
తిమ్మాపురంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. వారి ఇంటికి పక్కనే కొండప్ప, భాగ్యమ్మ దంపతుల కొడుకు సతీష్ నివసిస్తున్నాడు. అతను గుంతకల్లులోని ఓ ప్రయివేట్ పైపుల కంపెనీలో పని చేస్తున్నాడు. ఇరుగుపొరుగు కావడంతో అప్పుడప్పుడు మాట్లాడుకోవడం అంతా బాగానే ఉండేది. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ భార్య సుప్రజతో కాస్త చనువు ఏర్పడింది. దీంతో సతీష్, ఆమె ఇద్దరూ ఒక్కటయ్యారు. ఆ చనువు కాస్తా..ఇద్దరి మధ్య వివాహేతర బంధానికి దారి తీసింది. ఎవరికీ తెలియకుండా చాలా రోజులు అలాగే గడిపారు. కానీ.. కొద్ది రోజుల తర్వాత ఈ విషయం చంద్రశేఖర్‌కు తెలియడంతో భార్య సుప్రజను నిలదీశాడు. అంతే కాదు.. రోజూ ఇంట్లో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అటు సతీష్‌తోనూ గొడవ పడ్డ చంద్రశేఖర్.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు తనను బెదిరిస్తున్నట్లు సతీష్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలో రెండు పక్క ఇళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇదే సమయంలో ఇంట్లో ఉన్న సతీష్‌ను మరోసారి చంద్రశేఖర్, సుప్రజ తమ ఇంటికి పిలించారు. అలా సతీష్ వచ్చీ రావడంతోనే.. చంద్రశేఖర్ అతనిపై దాడి చేశాడు. పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ముఖం, ఛాతీపై దాడి చేయడమే కాకుండా.. చంద్రశేఖర్, సుప్రజ కలిసి గొంతు నులిమి చంపేశారు. సతీష్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.
సతీష్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. చంద్రశేఖర్ ఇంటిని పగలగొట్టి లోనికి వెళ్లడంతో అక్కడ సతీష్ శవం కనిపించింది. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పథకం ప్రకారమే ఇంట్లో పడుకున్న తమ కుమారుడిని ఫోన్ చేసి ఇంటికి పిలిపించి చంద్రశేఖర్ దంపతులు కలిసి హత్య చేశారని మృతుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న చంద్రశేఖర్, సుప్రజ కోసం గాలిస్తున్నారు పోలీసులు..
ప్రియుడిపై ప్రియురాలు దాడి
ఇక మరో కేసులో వివాహేతర బంధం కొనసాగిస్తున్న ప్రియుడిపై ప్రియురాలు దాడి చేసింది. ఏకంగా అతని మర్మాంగాన్నే కోసేసింది. అనంతపురంలో జరిగిన ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
అనంతపురంలోని బుడ్డప్పనగర్‌లో సునీత అనే మహిళ.. రాచానపల్లికి చెందిన సురేష్ అనే వ్యక్తితో 15 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. ఇన్నాళ్లూ బాగానే ఉన్న సురేష్.. సునీత కూతురుతో ఈ మధ్య అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. కూతురులా చూసుకోవాల్సిన అమ్మాయిపై కన్నేయడం సహించలేకపోయింది. కూతురుతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహించి గొడవ పెట్టుకుంది. అదే ఆవేశంలో కూరగాయలు కోసే కత్తితో అతని మర్మాంగంపై దాడి చేసింది. దీంతో లబోదిబోమన్నాడు సురేష్. రక్తపు మడుగులో ఉన్న అతన్ని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతపురం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి రెండు కేసుల్లో వివాహేతర బంధాలు.. ఘోరమైన నేరాలకు దారి తీశాయి.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..