Adilabad: హనీ ట్రాప్‌లో ఇదో రకం. కేవలం బైక్ మీద లిఫ్ట్ అడిగిన లేడీ కిలాడీ.. తనకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి నుంచే డబ్బులు గుంజింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మహిళతోపాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. బైక్ మీద వెళ్లే వాళ్లు.. సాధారణంగా ఎవరైనా లిఫ్ట్ అడిగితే.. కాదనకుండా ఇస్తారు.. అందులోనూ మహిళలు ఎవరైనా లిఫ్ట్ అడిగితే.. వారు ఇబ్బంది పడకూడదని.. మానవత్వంతో వారు దిగాల్సిన చోటు వరకు తీసుకు వెళ్తుంటారు. కానీ అలా ఓ మహిళకు లిఫ్ట్ ఇవ్వడమే అతని పాలిట శాపమైంది. ఏకంగా అతన్ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు.
READ MORE: Asim Munir nuclear threat: ఆసిమ్ మునీర్‌కు ఎందుకింత బలుపు..?
ఆదిలాబాద్‌కు చెందిన ఔట్సోర్సింగ్ఉద్యోగి వేష్కర్ రవికుమార్ జులై 21న కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఓ మహిళకు లిఫ్ట్ ఇచ్చాడు. ఆమెను కైలాస్నగర్సమీపంలో డ్రాప్ చేశాడు. ఐతే బైక్ మీద వస్తున్న సమయంలోనే ఆ మహిళ అతన్ని మాటలతో ముగ్గులోకి దింపింది. మెల్లగా రవికుమార్ ఫోన్ నంబర్తీసుకుంది. ఆ తర్వాత ఎవరి దారి వారు వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాతే అసలు కథ షురూ అయింది. సరిగ్గా జులై 23న రవికుమార్‌కు ఓ అన్‌నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి.. తనను తాను చాకటి కిరణ్‌గా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అతని స్వరం మారింది. ఏంటి నా మరదలును వేధిస్తున్నావని… తీవ్ర స్వరంతో అడిగాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే రూ. 50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఐతే పోలీసులు.. కేసులు అనే సరికి భయపడ్డ రవికుమార్.. తన బైక్ కాస్తా తాకట్టు పెట్టి రూ. 30వేలు సమకూర్చి చాకటి కిరణ్‌కు ఇచ్చాడు. అనంతరం ఈ విషయాన్ని తన తండ్రి అయిన రిటైర్డ్ఎస్సై లక్ష్మణ్‌కు చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు కిరణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు…
