Site icon NTV Telugu

Jabalpur Crime: దారుణం.. బెయిల్‌పై బయటకొచ్చి, గ్యాంగ్‌రేప్ చేసిన కిరాతకుడు

Jabalpur Crime News

Jabalpur Crime News

Accused On Bail Again Abuses Victim In Jabalpur: ఆ మానవ మృగం ఇదివరకే అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవించాడు. అయినా మార్పు రాకపోగా.. అంతకుమించిన దారుణానికి ఒడిగట్టాడు. తనపై కేసు పెట్టిన బాధిత యువతిని స్నేహితుడితో కలిసి గ్యాంగ్‌రేప్ చేశాడు. అంతటితో ఆగకుండా.. ఆ నేరాన్ని వీడియో తీశాడు. తాను చెప్పినట్లు చేయకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు. అయినా ఆ యువతి బెదరకుండా, పోలీసుల సహాయంతో అతడి ఆ కట్టించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఆ యువతి వయసు ఇప్పుడు 19 సంవత్సరాలు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాకు చెందిన ఆ యువతిపై రెండేళ్ల క్రితం వివేక్ పటేల్ అనే ఓ కీచకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. అప్పుడు అతనిపై ఆమె ఫిర్యాదు చేయగా.. దోషిగా తేల్చి, కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. అయితే.. ఏడాది తర్వాత అతడు బెయిల్‌పై బయటికొచ్చాడు. తనని జైలుపాలు చేసిన ఆ యువతిపై ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతూ వచ్చాడు. ఈసారి అతడు తన స్నేహితుడి సహాయం తీసుకున్నాడు. ఏడాది నుంచి ఆ యువతిని వెంబడిస్తున్న ఈ దుర్మార్గుడు.. సరైన సమయం కోసం వేచి చూశాడు.

ఈ క్రమంలోనే ఆ యువతి తన ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించి, ఇంట్లోకి దూరాడు. కత్తితో బెదిరించి, తన స్నేహితుడితో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ నేరాన్ని వీడియో తీసి, తనపై పెట్టిన కేసుని వెనక్కు తీసుకోవాలని, ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి మరోసారి పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న వివేక్ సహా అతని స్నేహితుని కోసం గాలింపు చర్యలు చేపట్టాడు. వివేక్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు పేర్కొంది.

Exit mobile version