Jabalpur Crime: దారుణం.. బెయిల్‌పై బయటకొచ్చి, గ్యాంగ్‌రేప్ చేసిన కిరాతకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Accused On Bail Again Abuses Victim In Jabalpur: ఆ మానవ మృగం ఇదివరకే అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవించాడు. అయినా మార్పు రాకపోగా.. అంతకుమించిన దారుణానికి ఒడిగట్టాడు. తనపై కేసు పెట్టిన బాధిత యువతిని స్నేహితుడితో కలిసి గ్యాంగ్‌రేప్ చేశాడు. అంతటితో ఆగకుండా.. ఆ నేరాన్ని వీడియో తీశాడు. తాను చెప్పినట్లు చేయకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు. అయినా ఆ యువతి బెదరకుండా, పోలీసుల సహాయంతో అతడి ఆ కట్టించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఆ యువతి వయసు ఇప్పుడు 19 సంవత్సరాలు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాకు చెందిన ఆ యువతిపై రెండేళ్ల క్రితం వివేక్ పటేల్ అనే ఓ కీచకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. అప్పుడు అతనిపై ఆమె ఫిర్యాదు చేయగా.. దోషిగా తేల్చి, కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. అయితే.. ఏడాది తర్వాత అతడు బెయిల్‌పై బయటికొచ్చాడు. తనని జైలుపాలు చేసిన ఆ యువతిపై ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతూ వచ్చాడు. ఈసారి అతడు తన స్నేహితుడి సహాయం తీసుకున్నాడు. ఏడాది నుంచి ఆ యువతిని వెంబడిస్తున్న ఈ దుర్మార్గుడు.. సరైన సమయం కోసం వేచి చూశాడు.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఈ క్రమంలోనే ఆ యువతి తన ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించి, ఇంట్లోకి దూరాడు. కత్తితో బెదిరించి, తన స్నేహితుడితో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ నేరాన్ని వీడియో తీసి, తనపై పెట్టిన కేసుని వెనక్కు తీసుకోవాలని, ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి మరోసారి పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న వివేక్ సహా అతని స్నేహితుని కోసం గాలింపు చర్యలు చేపట్టాడు. వివేక్ నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు పేర్కొంది.
తాజావార్తలు
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!