Site icon NTV Telugu

బస్సు కిటికీ నుంచి తల బయటకు పెట్టిన యువతి.. అంతలోనే

ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. కొన్ని సార్లు మన తప్పదం లేకుండానే ప్రమాదాలు సంభివిస్తే.. కొన్ని సార్లు నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు సంభవిస్తుంటాయి. అలాంటి ఘటనే ఇది. శ్రీశైలం ఘాట్‌ రోడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. శ్రీశైలం కొండపైకి వెళ్లేందుకు మలుపుతో ఉన్న రహదారిలో వెళ్లాల్సి ఉంటుంంది. అయితే అప్పటికీ ప్రమాదాలకు సంభవించకుండా ఉండేందుకు అధికారులు రాత్రి సమయం నుంచి ఉదయం వరకు శ్రీశైలంపైకి రాకపోకలు నిలిపివేస్తుంటారు.

అయితే తాజాగా ఓ యువతి బస్సులో శ్రీశైలంకు వెళుతున్న నేపథ్యంలో శ్రీశైలం సమీపంలో నల్లమల ఘాట్‌రోడ్డులో బస్సు కిటికీ నుంచి తలను బయటకు పెట్టింది. దీంతో ఎదురుగా వస్తున్న లారీ ఒక్కసారిగా ఆ యువతి తలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ హఠాత్పరిణామంతో బస్సులో ఉన్న వారు ఖంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version