Site icon NTV Telugu

అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకిన యువతి..

ameerpet metro

అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని యువతి అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ రెండవ అంతస్తు పైనుంచి దూకింది. దీంతో మెట్రో స్టేషన్‌ రెండో అంతస్తు నుంచి దూకడంతో ఒక్కసారిగా పక్కనే ఉన్న టింబర్‌ డిపోలో యువతి పడిపోయింది. శబ్దం విన్న స్థానికులు గమనించి వెంటనే యువతి వద్దకు చేరుకున్న పోలీసులకు సమాచారం అందించారు.

అంతేకాకుండా 108 వాహనంలో యువతిని ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు యత్నించిన యువతి వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ సమస్యలా? ఆర్థిక సమస్యలా? లేదా ప్రమాదవశాత్తు పడిందా ఎవరైనా నెట్టేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పోలీసులు పరిశీలిస్తున్నారు.

Exit mobile version