Tamilnadu: మద్యం మత్తు ప్రాణాలు తీస్తుందంటే ఎవరూ వినరు. చాలా మంది మందుబాబులు అదే పనిగా మందు తాగుతూ వేరే లోకంలో ఉంటారు. అలా తమ ప్రాణాల మీదికి తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. మద్యం మత్తులో ఉడుకుతున్న సాంబారులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మధురైలోని పలంగానట్టిలో చోటుచేసుకుంది. పలంగానట్టిలో గ్రామ దేవత ఉత్సవాల్లో ఈ ఘటన జరిగింది. ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాని కోసం వంటలు చేస్తుండగా ఆ ప్రాంతానికి మద్యం సేవించి ముత్తు కుమార్ అనే వ్యక్తి వచ్చాడు. అప్పటికే పీకల దాకా మద్యం మత్తులో మునిగి ఉన్నాడు.
Marredpally SI Vinay Kumar: నిన్న హెడ్ కానిస్టేబుల్, నేడు సీఐ.. కత్తితో దాడి చేసిన దుండగులు
వెనుక నుండి గోడ అనుకుని వేడివేడిగా ఉన్న సాంబారు గిన్నెను ఆనుకున్నాడు. మత్తులో ఉన్న ఆయనకు ఆ గిన్నె వేడి కూడా తగలలేదు. పూర్తిగా ఆ గిన్నె మీదికి ఒరిగేసరికి ఆ సాంబారులో పడిపోయాడు. లేవడానికి ప్రయత్నించినా వీలు కాలేదు. పక్కనే ఉన్న వంటలు చేస్తున్న వ్యక్తి పాటు చాలా మంది అతడిని బయటకు తీయడానికి ప్రయత్నించారు. ఆ వేడి కారణంగా తమ మీద సాంబారు పడుతుండడంతో వారికి ఇబ్బంది కలిగింది. అతడిని బయటికి తీయడానికి కాళ్లు, చేతులు, జుట్టు పట్టుకుని లాగారు. కానీ ప్రయత్నం విఫలమైంది. చివరకు ఏమి చేయలేక సాంబారు గిన్నెను గట్టిగా నెట్టేశారు. ఆ గిన్నె కింద పడడంతో ఆ వ్యక్తి బయటపడ్డాడు. కానీ అప్పటికే చాలా గాయాలయ్యాయి. అతడిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి తరలిస్తుండగానే ముత్తుకుమార్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.