A Man Commits Suicide Due To Extramarital Affair In West Bengal: వివాహేతర సంబంధాల కారణంగా.. ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయో, ఎన్ని దారుణాలు చోటు చేసుకున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. తాజాగా పశ్చిమబెంగాల్‌లో మరో సంఘటన వెలుగు చూసింది. ఓవైపు భార్యతో కాపురం చేస్తూ.. మరోవైపు మేనత్తతో వివాహేతర సంబంధాన్ని నడిపించాడు ఓ వ్యక్తి. అయితే.. పరిస్థితులు చెయ్యి దాటడంతో ఏం చేయలేక తెలీక.. ఆ వ్యక్తి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరిని వేగలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా పరిధి పర్తులికి చెందిన ఓ వ్యక్తి.. డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పదేళ్ల క్రితం ఓ మహిళతో ఇతనికి వివాహం కాగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య, పిల్లలతో అతడి జీవితం సజావుగానే సాగింది. అయితే.. మేనత్త రూపంలో అతని కుటుంబంలో అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. కొంతకాలం క్రితం యువకుడి మేనమామ చనిపోవడంతో, మేనత్త ఒంటరిగా ఉంటోంది. అప్పటినుంచి ఆమె ఇంటి బాధ్యతల్ని కూడా అతడే చూసుకునేవాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భార్యకు తెలీకుండా, మేనత్త ఇంటికి తరచూ వెళ్లేవాడు. తన ఇంట్లో కంటే.. మేనత్త ఇంట్లోనే ఎక్కువ సమయం ఉండేవాడు. దీంతో భార్యకి అనుమానం రావడంతో నిలదీసింది. ఆ విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగడంతో.. వ్యవహారం గ్రామ పెద్దల దాకా వెళ్లింది.
అయినా.. అతనిలో మార్పు రాలేదు. మేనత్త ఇంటికి వెళ్లడం ఆపలేదు. దాంతో.. ఇంట్లో గొడవలు మరింత పెరిగాయి. ఇంట్లో గొడవలు ఎక్కువైపోవడంతో.. భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అటు మేనత్తని వదల్లేక, ఇటు భార్యతో గొడవ పడలేక.. ఆ వ్యక్తి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం పొలం పనులకు వెళ్తున్నానని చెప్పి.. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి, యాసిడ్ తాగాడు. ఇది మనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. అతడు చికిత్స పొందుతూ మరణించారు. ఆ వ్యక్తి మృతికి మేనత్తే కారణమని తెలిసి.. ఆమెను పట్టుకొని చితకబాదారు. జుట్టు కత్తిరించి ఊరేగించారు. పోలీసులకు సమాచారం తెలియడంతో.. రంగంలోకి దిగి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
