A Foreigner Arrested For Running Fake Currency Business In Hyderabad: ఓవైపు ప్రపంచ దేశాలు సాంకేతికపరంగా దూసుకెళ్తుంటే.. మన ఇండియాలో మాత్రం మూఢనమ్మకాలు ఇంకా ప్రబలుతూనే ఉన్నాయి. చేతబడి, బ్లాక్ మ్యాజిక్ వంటి వాటిని మన భారతీయులు ఇంకా నమ్ముతూనే ఉన్నారు. ఇటువంటి వాళ్లు ఉన్నారు కాబట్టే.. మోసగాళ్లు పుట్టుకొస్తున్నారు. బ్లాక్ మ్యాజిక్‌తో ధనవంతులు అవ్వొచ్చంటూ.. వారి వద్ద నుంచి లక్షలకు లక్షలు దోచేస్తున్నారు. ఇప్పుడు ఓ విదేశీయుడు కూడా సరిగ్గా ఇలాంటి మోసానికే పాల్పడ్డాడు. బ్లాక్ మ్యాజిక్‌తో నగదుని రెండింతలు చేస్తానని నమ్మంచి.. కొందరు వ్యక్తుల నుంచి భారీ డబ్బులు కాజేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Diamond Ring Theft: ఆసుపత్రిలో సిబ్బంది చేతివాటం.. 50 లక్షల డైమండ్ ఉంగరం చోరీ
జాన్‌గుయ్ రోస్టండ్ అనే విదేశీయుడు హైదరాబాద్‌లో ఫేక్ కరెన్సీ దందా నిర్వహిస్తున్నాడు. ఐవరి కోస్ట్ దేశానికి చెందిన ఈ విదేశీయుడు.. బ్లాక్ మ్యాజిక్‌తో నగదు రెండింతలు చేస్తానని.. ఎల్బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి భారీ నగదు తీసుకున్నాడు. అతనికి ఫేక్ కరెన్సీ ఇచ్చాడు. మొదట్లో నిజమేనని ఆ వ్యక్తి అనుకున్నాడు. కానీ, అవి ఫేక్ నోట్లు అని తెలియడంతో పోలీసుల్ని ఆశ్రయించాడు. ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి.. ఆ విదేశీయుడ్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.10 లక్షల ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. ఫేక్ కరెన్సీ తయారు చేసేందుకు వినియోగిస్తున్న పేపర్స్, కెమికల్స్, కట్టర్‌ని అదుపులోకి తీసుకున్నారు.
Dowry Harassment: పెళ్లికి ముందే వరకట్న వేధింపులు.. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే..
మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఆ విదేశీయుడి మీద గతంలోనే మాధాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు ఉంది. గతంలో ఇతగాడు రూ.25 లక్షలు మోసం చేసి, పారిపోయాడు. ఇప్పుడు ఎల్బీనగర్‌లో పట్టుబడ్డాడు. ఇతని గురించి ఆరా తీయగా.. మన దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు తెలిసింది. దీంతో.. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అతనొక్కడే ఈ ఫేక్ కరెన్సీ దందా నడుపుతున్నాడా? లేక తెరవెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణాల్లో విచారిస్తున్నారు.